బిజినెస్

వాణిజ్య వివాదాల సత్వర పరిష్కారానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: 3ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్4లో ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈక్రమంలో వాణిజ్య పరమైన వివాదాలను నిర్ధేశిత కాలంలోగా సత్వర పరిష్కరించే విషయంలో న్యాయవ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. ఇటీవలి వర్షాకాల సమావేశా ల్లో లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లును ఆధారంగా చేసుకుని ఈ ఆర్డినెన్స్‌ను తీసుకురావాల ని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో ఉంది. బహుశా వచ్చే నవంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశాలున్నాయని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. స్థానికంగా, అంతర్జాతీయంగా ఉన్న వాణిజ్య పరమైన వివాదాలను సత్వరం పరిష్కరించే న్యాయవ్యవస్థకు మనదేశం ఓ హబ్‌లా ఆదర్శవంతంగా నిలవాలని భావిస్తోంది. సంస్థాగతంగా ఎదరవుతున్న వివాదాల పరిష్కారానికి స్వతంత్రంగా వ్యవహరించే ఓ బలమైన వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో ఆర్బిట్రేషన్ చట్టాన్ని సవరించడం ద్వారా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పా టు చేసి తద్వారా మంచి విలువలను అనుసరిస్తూ ఆర్బిట్రేషన్ విధానాన్ని స్నేహపూర్వకంగా, ఆర్థిక వెసులుబాటుగా ఉండేలా చేసి వివాదాలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తోం ది. భారత న్యాయ మండలి ఇందుకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుందని దానిద్వారా బాధ్యతాయుతమైన, గుర్తింపు పొందిన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుంటుందని ఆయన చెప్పారు. పనితీరులో నాణ్యతను బేరీజువేస్తూ గ్రేడింగ్ ఇస్తూ వారిలో ప్రావీణ్యతను పెంపొందించేలా శిక్షణను ఇవ్వాలని భావిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఇందుకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన నిర్ణయాధికారాలు గల వ్యవస్థ అవసరమని ఆ అధికారి తెలిపారు. మనదేశానికి చెందిన వాణిజ్యపరమైన కేసులు అధిక సంఖ్యలో సింగపూర్, లండన్, ప్యారిస్ వంటి దేశాల్లోనే విచారణ జరుగుతున్నాయి. సుమారు 30 మిలియన్ కేసులు ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేకించి పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధాల వంటి వాటివల్ల ఈ కేసులు అనేకం పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడులు, లావాదేవీల వివాదాలు సైతం కుప్పలు తెప్పలుగా పేరుకుంటున్నాయి.