బిజినెస్

అతి త్వరలోనే ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: డాలర్‌తో రూపాయి మారకం విలువను 68-70 మధ్య స్థాయికి పెంచడానికి ప్రభుత్వం అతి త్వరలోనే అత్యవసరం కాని సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధించడం సహా రెండో దశ చర్యలను అమలు చేయనుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ తెలిపారు. అయితే రూపాయి మారకం విలువ సుమారు 12 శాతం పతనం కావడమనేది తాత్కాలికమేనని ఆయన పేర్కొన్నారు. రూపాయి విలువను పెంచడంతో పాటు కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరగడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నెల మొదట్లో కొన్ని చర్యలను ప్రకటించింది. వస్తు తయారీ (మాన్యుఫాక్చరింగ్) కంపెనీలకు విదేశీ రుణాల మార్గదర్శకాలను సరళతరం చేయడం, కార్పొరేట్ బాండ్లలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్ల (ఎఫ్‌పీఐల) పెట్టుబడులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, మాసాలా బాండ్లపై పన్ను ప్రయోజనాలు కల్పించడం వంటివి ప్రభుత్వం ప్రకటించిన చర్యలలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అత్యవసరం కాని సరుకుల జాబితాను రూపొందించింది. ఈ సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తుంది. అలాగే స్వల్పంగా విధానపరమయిన జోక్యం చేసుకోవడం ద్వారా ఎగుమతులను పెంచవలసిన సరుకుల జాబితాను కూడా కేంద్రం తయారు చేసిందని గార్గ్ ఆదివారం ఒక వార్తాసంస్థకు చెప్పారు. తొలి దశ చర్యలను ప్రకటించినప్పటికీ రూపాయి పతనం కొనసాగుతుండటంపై ఆయన స్పందిస్తూ తొలి దశ చర్యలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, ముఖ్యంగా అత్యవసరం కాని సరుకుల దిగుమతులపై ఆంక్షలు, కొన్ని సరుకుల ఎగుమతులను పెంచడానికి తీసుకోవలసిన చర్యలు ఇంకా అమలు కాలేదని తెలిపారు. ‘ఈ చర్యలు అమలు చేయడానికి సన్నాహాలు తుది దశలో ఉన్నాయి. అతి త్వరలోనే వీటిని ప్రకటించడం జరుగుతుంది’ అని గార్గ్ వెల్లడించారు. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి నేతృత్వంలోని బృందం దిగుమతులపై ఆంక్షలు విధించవలసిన, ఎగుమతులను ప్రోత్సహించవలసిన సరుకుల జాబితాలకు తుది రూపం ఇచ్చే పనిని దాదాపు పూర్తి చేసిందని ఆయన వివరించారు. ‘ఒకసారి ఉన్నత స్థాయి నుంచి ఆమోదం లభించిన వెంటనే వీటిని ప్రకటించడం జరుగుతుంది. అతి త్వరలోనే ఇది జరుగుతుంది’ అని గార్గ్ పేర్కొన్నారు.