బిజినెస్

చమురు ధరలే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదాలు, రూపాయి కదలికలు, ముడి చమురు ధరల తీరు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ)కు సంబంధించిన పరిణామాలను కూడా మదుపరులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం అకస్మాత్తుగా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల షేర్లు పతనం కావడంతో దాని ప్రతికూల ప్రభావం వల్ల దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 1,100కు పైగా పాయింట్లు పడిపోయింది. ‘ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్ బలపడటం, ద్రవ్య లోటు పెరగడం వంటి ప్రతికూల అంశాల వల్ల స్టాక్ మార్కెట్ మరింత సంఘటితం అయ్యే అవకాశం ఉంది. అయితే, తీవ్ర స్థాయిలో కరెక్షన్ చోటు చేసుకోవడం వల్ల ఆయా రంగాలు, షేర్లలో విలువ ఆధారంగా కొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. లాభాలు ఆర్జించేందుకు వీలుగా ఆరోగ్యకరంగా ఉన్న కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. వచ్చే వారంలో అమెరికా ఎఫ్‌ఓఎంసీ సమావేశం కీలకమయిన ఈవెంట్. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ ధోరణిని నిర్దేశిస్తాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరగడంతో భారత కరెన్సీ రూపాయి మారకం విలువ ఇటీవలి కాలంలో భారీగా పతనమయింది. సెప్టెంబర్ నెల డెరివేటివ్‌ల కాలపరిమితి గురువారం ముగియనుండటంతో వచ్చే వారంలో స్టాక్ మార్కెట్‌లో ఊగిసలాట ధోరణి కూడా నెలకొనే అవకాశం ఉంది. ‘అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) కీలక వడ్డీ రేట్లపై వచ్చే వారంలో తన నిర్ణయాన్ని వెలువరుస్తుంది. ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో కరెక్షన్ చోటు చేసుకున్నందున మార్కెట్ సూచీలు మధ్యంతర దిగువ స్థాయిని తాకాయని మేము భావిస్తున్నాం. ఇది మార్కెట్లు కన్సాలిడేట్ కావడమే’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ విభాగం అధిపతి వీకే శర్మ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బీఎస్‌ఈ సెనె్సక్స్ భారీగా 1,249.04 పాయింట్లు (3.28 శాతం) పడిపోయి, 36,841.60 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో చివరి రోజయిన శుక్రవారం సెషన్ మధ్యలో అకస్మాత్తుగా ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల ధరలు పతనం కావడం మదుపరులను ఆందోళనకు గురి చేసింది.