బిజినెస్

నోట్ల చలామణి వేగం తగ్గింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 24: ద్రవ్య చలామణి వేగం తగ్గింది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, ఆ మొత్తం విలువలో 99.99 శాతం మేర కొత్త నోట్లును రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. దీనితో క్రమంగా నోట్ల చలామణి పెరిగింది. అయితే, ఈ ఏడాది మే మాసం నుంచి సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీ (సీఐసీ) తగ్గిందని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. పెట్రో ధరల పెరుగుదల, ఫోరెక్స్ మార్కెట్‌లో రిజర్వ్ బ్యాంక్ ప్రత్యక్ష జోక్యం వంటి అంశాలు నోట్ల చలామణి వేగాన్ని తగ్గించాయని ఈ నివేదిక పేర్కొంది. 2017 జనవరిలో 9 ట్రిలియన్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండగా, 2018 మే మాసానికి అది 19.5 ట్రిలియన్లకు చేరింది. అయితే, మే నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ మధ్య కాలాన్ని పరిశీలిస్తే చాలామణి తగ్గింది. ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రో ధరలతో ప్రజలు వివిధ రకాల ఖర్చులను తగ్గించుకున్నారని, నోట్ల చలామణి తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం, రూపాయి మారకపు విలువ పడిపోవడం వంటి కారణాలతో మదుపరులు తమ పెట్టుబడులను మరింత పెంచుకోవడం సైతం నోట్ల చలామణి వేగాన్ని తగ్గించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొత్తం మీద అనేకానేక కారణాలు ప్రభావితం చేయడంతో, కరెన్సీ సర్క్యులేషన్ తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.