బిజినెస్

ప్రకృతి సేద్యంపై ఏపీలో గ్లోబల్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 25: జీరో పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త ఒరవడిని సృష్టించనుందని అంతర్జాతీయ సంస్థలు కితాబిచ్చాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఐసీఆర్‌ఏఎఫ్‌కు చెందిన ప్రపంచ ఆగ్రో ఫారెస్ట్రీ సెంటర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టోనీ సైమన్స్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రశంసించారు. ఆయనతో పాటు సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రవి ప్రభు న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో వ్యవసాయ- అటవీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి చేస్తున్న తమ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రకృతి సేద్యాన్ని ఆసక్తికరంగా పరిగణిస్తుందని టోనీ సైమన్స్ వెల్లడించారు. అభివృద్ధిలోనే పరిశోధన ఉంటుందని ముఖ్యమంత్రి ఆలోచనా విధానంలో అది ప్రస్ఫుటమవుతోందని ఐసీఆర్‌ఏఎఫ్ అధినేతలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తమ పరిశోధనలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. క్షేత్ర స్థాయిలో సవివరమైన వాస్తవ గణాంకాలను, వివరాలను ఏపీలో సంగ్రహించాలని నిర్ణయించారు. దీని ఆధారంగా మరింత లోతైన పరిశోధనలు నిర్వహించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు.
రైతులకు ఇచ్చే శిక్షణ కూడా ఇందులో కీలకమని ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచనా విధానం ఆహ్వానించదగిందని స్పష్టంచేశారు. పరిశోధన, పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుని ప్రకృతి సేద్యాన్ని పెద్దఎత్తున చేపట్టే ఆంధ్రప్రదేశ్ ప్రయత్నంలో భాగస్వామ్యం పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆగ్రో ఫారెస్ట్రీ డీజీ ఆసక్తి చూపారు. ఈ మేరకు రాష్ట్రంలో ఒక గ్లోబల్ సెంటర్ ఏర్పాటుకు సమాలోచనలు జరిపారు.