బిజినెస్

పొదుపు మార్గాలను అనే్వషిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగటు మనిషి భవిష్యత్తు పొదుపుపైనే ఆధారపడి
ఉందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వేతన జీవులు తమ సంపాదనలో కాస్తాకూస్తో దాచుకుంటేనే జీవితం. లేదంటే అంతే సంగతి. ప్రభుత్వాలు సైతం ఏటా ప్రవేశపెట్టే తమ బడ్జెట్‌లలో పొదుపునకు ప్రాధాన్యం ఇస్తుండటం దానికున్న అవసరాన్ని గుర్తు చేస్తోంది
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ను చూస్తే.. వేతన జీవులకు కొంత తీపిని, మరికొంత చేదును పంచిపెట్టింది. హెచ్‌ఆర్‌ఎ మినహాయింపులు, ఎన్‌పిఎస్ పన్నులపై పాక్షిక ఉపసంహరణలు, గృహ రుణ వడ్డీరేట్లపై అదనపు కోతలు తీపి కబుర్లేనని చెప్పాలి. అయితే బడ్జెట్‌లో ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్) ఉపసంహరణలపైనా పన్నును వేయాలని ప్రతిపాదించినప్పటికీ.. దీనిపై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవడంతో ఆ ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. సగటు మనిషి పొదుపు ప్రణాళికకు మూలాధారమైన ఇపిఎఫ్‌పై ప్రభుత్వం ఒకవేళ భారం మోపితే? ఈ ఆలోచనే వేతన జీవుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది కదూ.. అయితే ఇలాంటి సమయంలో కొన్ని ప్రత్యామ్నాయాలూ లేకపోలేదు అవి...

యులిప్ పథకాలు
యూనిట్ లింక్డ్ బీమా పథకాలు (యులిప్స్).. మ్యూచువల్ ఫండ్ పథకాలకు చాలా దగ్గరగా ఉంటాయి. బీమాతోపాటు పెట్టుబడులకు సంబంధించినవే యులిప్స్. పదవీవిరమణ అనంతరం చేసే పొదుపునకు యులిప్స్ చక్కటి వేదిక. ఎందుకంటే ఈక్విటీ, డెట్ ఆప్షన్లతోపాటు ఈ రెండింటినీ ఒకేసారి అందుకోవచ్చు. పన్ను మినహాయింపు ప్రయోజనాలతోపాటు ఉపసంహరణలపై పూర్తిగా పన్నులుండవు. అయితే యులిప్స్‌పై కొన్ని వాదనలు వినిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా వీటిని ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి విషయంలో అన్నింటినీ తెలుసుకునే నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఎమ్‌ఎఫ్ రిటైర్మెంట్ పథకాలు
మ్యూచువల్ ఫండ్ (ఎమ్‌ఎఫ్) పదవీవిరమణ పథకాలను కూడా మీరు పరిశీలించవచ్చు. సెక్షన్ 80సి క్రింద ఈ పథకాలకు పన్ను మినహాయింపు ఉంది. ఇపిఎఫ్, ఎన్‌పిఎస్ మాదిరే ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఎంచుకునే పథకాల ఆధారంగా పూర్తిగా పన్ను మినహాయింపు? లేదా ఇపిఎఫ్ కంటే మరింత మెరుగైనదా? అనేది ఉంటుంది. ఫండ్ పోర్ట్ఫోలియో ఈక్విటీ కంపోనెంట్ 65 శాతం అంతకంటే ఎక్కువగా ఉంటే ఈక్విటీ ఫండ్‌గా, తక్కువగా ఉంటే డెట్ ఫండ్‌గా పరిగణిస్తారు. వీటి ఆధారంగా పన్ను ప్రయోజనాలను పొందేందుకు అర్హత ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పదిహేను సంవత్సరాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)కు మీరు చందాలు చెల్లించి, ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోనైట్లైతే, ఆ మొత్తంపై మీరు పొందుతున్న వడ్డీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. నిర్ణీత పదిహేనేళ్ల గడువు పూర్తయిన తర్వాత కూడా మరో ఐదేళ్లపాటు ఆ మొత్తాన్ని అలాగే ఉంచితే ఆపై వచ్చే వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. పిపిఎఫ్ విరాళాలు కూడా ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాల పరిధిలోకి వచ్చేవే. అయితే పిపిఎఫ్‌పై పొందే ఆదాయానికి పన్ను మినహాయింపుపై ప్రభుత్వం స్పందిస్తూ భవిష్యత్తులో పాక్షికంగా పన్ను విధించే వీలుందన్న సంకేతాలనిస్తోంది. అయినప్పటికీ ఇప్పటికైతే పిపిఎఫ్ సేఫ్ అనే చెప్పొచ్చు.

జాతీయ పెన్షన్ పథకమూ పెట్టుబడులకు మార్గమే
సామాన్యుల పెన్షన్ ఆలోచనలను ప్రోత్సహించేందుకు తెచ్చినదే ఈ జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పిఎస్). ఇప్పటిదాకా ఎన్‌పిఎస్ ఉపసంహరణలపై పన్ను విధిస్తుండగా, ఇకపై కొంత ఉపశమనం లభించనుంది. ఈ పథకం క్రింద ఒకే పెన్షన్ ఖాతా ఉంటుంది. ఉద్యోగం మారినప్పటికీ ఈ ఖాతా మాత్రం మారదు. అంతటా దీన్ని కొనసాగించుకోవచ్చు. ఎన్‌పిఎస్‌లో రెండు రకాల ఖాతాలున్నాయి. ప్రథమ శ్రేణి ఖాతాల కోసం ఏడాదికి 6,000 రూపాయలు, ద్వితీయ శ్రేణి ఖాతాల కోసం ఏటా వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రథమ శ్రేణి ఖాతా తప్పనిసరి. ద్వితీయ శ్రేణి ఖాతా మాత్రం ఖాతాదారుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇక పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) అధీనంలో ఎన్‌పిఎస్ నడుస్తుంది. వివిధ ప్రభుత్వ నియామక ఫండ్ మేనేజర్ల ద్వారా పెట్టుబడులు జరుగుతాయి. ఈక్విటీ, నిర్ణీత ఆదాయం ఇలా ఏదైనా పథకాలను ఎంచుకోవచ్చు. వీటిల్లో మీ ఖాతాల ద్వారా సొమ్మును పెట్టుబడిగా పెడతారు. మీ వయసు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి. ఇక మీ సొమ్ములో 50 శాతం మాత్రమే ఈక్విటీ ఆస్తుల శ్రేణిలో పెట్టుబడులుగా పెట్టేందుకు అవకాశం ఉంది. మిగతా 50 శాతం బాండ్లు తదితర ప్రభుత్వ సెక్యూరిటీల్లో లేదా నిర్ణీత ఆదాయ సెక్యూరిటీల్లో పెట్టుకోవచ్చు. ఎన్‌పిఎస్‌లో సెక్షన్ 80సిసిడి క్రింద 1.5 లక్షల రూపాయల వరకు మీరు పన్ను మినహాయింపుపును పొందవచ్చు. మీకు ఉద్యోగమిచ్చిన సంస్థ కూడా మీ ఎన్‌పిఎస్ ఖాతాకు విరాళమిస్తే సెక్షన్ 80సిసిడి(2) ప్రకారం డిఎ, కనీస వేతనంలో 10 శాతాన్ని మీరు పొందవచ్చు. కాబట్టి ఒకవేళ ఏటా మీ కనీస వేతనం 4 లక్షల రూపాయలైతే అదనంగా మీరు 40,000 రూపాయల పన్ను మినహాయింపును పొందవచ్చు. అలాగే ఎన్‌పిఎస్‌లో 50,000 రూపాయలకు మించి మీరు పెట్టుబడి పెట్టినట్లైతే సెక్షన్ 80సిసిడి (1బి) క్రింద అదనంగా 50,000 రూపాయల వరకు పన్నులను తగ్గించుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ప్రథమ శ్రేణి ఖాతాలకే పరిమితం. ద్వితీయ శ్రేణి ఖాతాల ద్వారా జరిగే పెట్టుబడులకు కాదు.