బిజినెస్

సింహాచలం కొండపై సోలార్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 18: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో సోలార్ పవర్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషీయంట్ ఎండోమెంట్ ప్రాజెక్ట్ (ఇఇఇపి)ను అమలు చేయనుంది. దీనివల్ల సింహాచలం కొండపై వరుసగా నాలుగు భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ఇందులో సోలార్ విద్యుత్ ఎల్‌ఇడి వీధి దీపాలు, సోలార్ కుకింగ్ సిస్టమ్, విండ్‌మిల్స్, సోలార్ వాటర్ హీటర్స్ వంటి వాటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింహాచలం దేవస్థానంలో ఏటా 11.2 లక్షల యూనిట్ల మేర విద్యుత్ వాడకం ఉంటుంది. అదే సోలార్ పవర్ అందుబాటులోకి వస్తే 4.7 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. అలాగే భక్తుల ప్రసాదాల కోసం నిర్వహించే వంటకాల కోసం ఉపయోగిస్తున్న ఎల్‌పిజి గ్యాస్ వాడకం ద్వారా 40 టన్నుల గ్యాస్ వినియోగమవుతుంది. దీనివల్ల ఏకంగా రూ. 44 లక్షల మేర దేవస్థానం ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే సోలార్ కుకింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే గ్యాస్ సగానికి పైగా ఆదా కానుంది. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎస్‌ఇసిఎం) జరిపిన అధ్యయనం ప్రకారం సింహాచలం కొండపై ఈ ప్రాజెక్టులన్నింటినీ ఏర్పాటు చేసేందుకు పరిస్థితులు కూడా అనువుగా ఉన్నట్టు తేలింది. కొండపై సోలార్ వాటర్ హీటర్స్‌ను ఏర్పాటు చేస్తే భక్తులకు వేడి నీళ్లను అందించవచ్చు. అలాగే సోలార్ విద్యుత్ ఎల్‌ఇడి వీధి దీపాలను సింహాచలం కొండపైన, దిగువ భాగాన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల కాలుష్యరహిత దేవస్థానంగాను, పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని భావిస్తున్నారు. అందువల్లే దేశంలోనే మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటి వద్ద పూర్తిస్థాయిలో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులోభాగంగా విజయవాడలో బ్రమరాంబ మల్లిఖార్జున దేవాలయం, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానం, శ్రీకాళహస్తీశ్వరస్వామి, కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాయలం, ద్వారకాతిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవాలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామివారి దేవస్థ్థానాల్లో ఇఇఇపి భారీ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా అన్ని దేవాలయాల్లో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఏడాదికి 60 లక్షల యూనిట్ల విద్యుత్‌ను, మరో 200 టన్నుల ఎల్‌పిజి గ్యాస్‌ను ఆదా చేయవచ్చని ఎస్‌ఇసిఎం సిఇఒ ఏ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. సింహాచలం దేవస్థానం వద్ద విండ్ పవర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా ఆయన తెలియజేశారు.