బిజినెస్

ఆగని పెట్రో మంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పెట్రోలు, డీజిల్ ధర పెరుగుతునే ఉంది. సోమవారం ఏకంగా 21 పైసలు పెరగడంతో, లీటర్ పెట్రోలు ధర వంద రూపాయలకు చేరడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈనెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోలుపై సుంకాన్ని 2.5 రూపాయలు తగ్గించిన విషయం తెలిసిందే. మరో 2.5 రూపాయలను భరించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రకటించిన తగ్గింపులో చమురు కంపెనీల వాటా రూపాయి ఉంది. కాగా, సర్కారు సుంకాన్ని తగ్గించినప్పటికీ, శనివారం 18 పైసలు పెరిగిన లీటర్ పెట్రోలు ధర ఆదివారం మరో 14 పైసలు ఎగబాకింది. సోమవారం 21 పైసలు పెరింది. దీనితో ఢిల్లీలో లీటర్ పెట్రోలు 82.03 రూపాయలకు చేరింది. 29 పైసలు పెరిగిన డీజిల్ 29 పైసలు పెరగడంతో 73.82 రూపాయలైంది. లీటర్ పెట్రోలు ముంబయిలో 87.50, హైదరాబాద్‌లో 86.74 రూపాయలు, డీజిల్ ముంబయిలో 77.37 రూపాయలు, హైదరాబాద్‌లో రూ.79.98కి చేరింది.