బిజినెస్

మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఒక పక్క షేర్‌మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులతో భారీ నష్టాలను నమోదు చేస్తున్న నేపథ్యంలో మదుపరులు మ్యూచ్‌వల్ ఫండ్లపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందులో మదుపు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల కాలానికి 65 లక్షల కొత్త ఖాతాలు నమోదయ్యాయని, దీంతో మ్యూచ్‌వల్ ఫండ్లలో నమోదైన ఖాతాల సంఖ్య 7.78 కోట్లకు చేరుకుందని అధికారవర్గాలు వెల్లడించాయి. 2017-18 సంవత్సరంలో కొత్తగా 1.6 కోట్ల ఖాతాలు, 2016-17లో 67 లక్షలు, 2015-16లో 59 లక్షల మదుపరుల ఖాతాలు అదనంగా నమోదైనట్టు తెలిపారు. ఇందులో ఒకరికే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలున్నా మదుపరులు 41 ఫండ్లలో రికార్డు స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పెట్టుబడి పెట్టిన ఖాతాల సం ఖ్య 7 కోట్ల 78 లక్షల 86 వేల 596కు చేరుకుంది. ఈ ఆరు నెలల్లో కొత్తగా నమోదైన ఖాతాల సంఖ్య 65.39 లక్షలు. కొనే్నళ్లుగా మ్యూచ్‌వల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా చిన్న పట్టణాలకు చెందిన రిటైల్ ఇనె్వస్టర్లు వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీంతో ఈక్విటీ, ఈక్విటీ లింక్‌డ్ పొదుపు ఖాతాల సంఖ్య 56 లక్షల నుంచి 5.91 కోట్లకు చేరకుంది. బ్యాలెన్స్‌డ్ ఫండ్ విభాగంలో వీటి సంఖ్య నాలుగు లక్షల నుంచి 63 లక్షలకు పెరిగింది. అదేవిధంగా ఇన్‌కమ్ ఫండ్లు 5.2 లక్షల నుంచి 1.12 కోట్లకు చేరింది. 2018-19 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మదుపరులు 45వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినట్టు ఆంఫీ సీఈఓ ఎన్.ఎస్ వెంకటేష్ తెలిపారు. ఒడిదుడుకులు లేకుండా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలు మ్యూచ్‌వల్ ఫండ్ల ద్వారా లభిస్తుండటంతో మదుపరులు వీటిపై ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పారు. కాగా ప్రజల నుంచి సేకరించిన ఈ మొత్తాలను మ్యూచ్‌వల్ ఫండ్లు స్టాక్‌లు, బాండ్లు, ఇతర మనీ మార్కెట్‌లలో పెట్టుబడులుగా పెడుతోంది.