బిజినెస్

జెఎస్‌డబ్ల్యు చేతికి జైప్రకాశ్ థర్మల్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ.. మధ్యప్రదేశ్‌లోని బినా వద్దగల జైప్రకాశ్ పవర్ వెంచర్స్‌కు చెందిన 500 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయనుంది. 2,700 కోట్ల రూపాయలకు ఈ ప్లాంట్‌ను జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ సొంతం చేసుకుంటోంది. 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు ఈ ప్లాంట్‌లో ఉన్నట్లు జెఎస్‌డబ్ల్యు చెప్పింది. ఈ వివరాలను సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు పేర్కొంది. ఇదిలావుంటే ఈ ఏడాది మే నెలలో చత్తీస్‌గఢ్‌లోగల తన సోదరుడి సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్‌కు చెందిన థర్మల్ పవర్ ప్లాంట్‌ను దాదాపు 6,500 కోట్ల రూపాయలకు జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ అధినేత సజ్జన్ జిందాల్ కొనుగోలు చేసినది తెలిసిందే. 2020 నాటికి 10,000 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ ప్రత్యర్థి సంస్థల కొనుగోళ్లకు దిగింది.