బిజినెస్

అథమ స్థానంలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 9: సమాజంలో అసమానతలు తొలగించడంలో ప్రపంచ స్థాయి ర్యాంకులో భారత్ అట్టడుగున ఉన్న పది దేశాల్లో ఒకటిగా ఉంది. మొత్తం 157 ర్యాంకుల్లో భారత్ ర్యాంకు 147వ స్థానం లభించింది. ఇంగ్లాండ్‌కు చెందిన చారిటీ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్స్ కమిట్‌మెంట్ టు రెడ్యూజింగ్ ఇనీక్వాలిటీ (సీఆర్‌ఐ) సంస్థ సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది. భారత్ సమాజంలో అసమానతలను తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఈ సంస్థ పేర్కొంది. భారత్ జనాభా 1.3 బిలియన్లు. ఆర్థిక పరమైన అసమానతలు తొలగించేందుకు తీసుకుంటే పేదల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ఈ సంస్థ పేర్కొంది. విద్య, సామాజిక రక్షణ, ప్రజారోగ్యానికి ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్నది అంతంతమాత్రమేనని పేర్కొన్నారు. దక్షిణ కొరియా, నమీబియా, ఉరుగ్వే లాంటి దేశాలు సమాజంలో అసమానతలను తొలగించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయని సర్వేలో వెల్లడైంది. భారత్, నైజీరియా దేశాల్లో అసమానతల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు పేలవంగా ఉన్నాయి. అసమానతలను రూపుమాపేందుకు తగిన చిత్తశుద్ధి ఈ దేశాల్లో కొరవడిందని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. భారత్‌లో కార్మికుల హక్కుల పరిరక్షణ కూడా అంతంత మాత్రమేనని పేర్కొన్నారు. పని చేసే ప్రదేశాల్లో మహిళలకు లభించే గౌరవం కూడా అంతత మాత్రమేనని సర్వే పేర్కొంది.
అసమానతలను తొలగించాలంటే సామాజిక భద్రత, సంక్షేమానికి నిధుల వ్యయం పెరగాలని, పన్ను, కార్మికుల హక్కుల విధుల అమలు బాగుండాలని ఈ సంస్థ పేర్కొంది. పన్నులు, సామాజిక భద్రతలో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. అత్యున్నత ర్యాంకుల్లో ఉండే జపాన్ 11వ స్థానానికి దిగజారింది. ఇథియోఫియా 131వ స్థానంలో ఉంది.