బిజినెస్

హెచ్‌యుఎల్ లాభం రూ. 1,174 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ (హెచ్‌యుఎల్) స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 9.79 శాతం పెరిగి 1,173.90 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్ వ్యవధిలో 1,069.16 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందింది. నికర అమ్మకాలు ఈసారి 7,987.74 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 7,712.71 కోట్ల రూపాయలుగా ఉన్నాయని సోమవారం ఓ ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు 21 ఏళ్ల జాయింట్ వెంచర్ కింబర్లే-క్లార్క్ లివర్ ప్రైవేట్ లిమిటెడ్ (కెసిఎల్‌ఎల్) నుంచి బయటకు వద్దామని హెచ్‌యుఎల్ యోచిస్తోంది. 1995లో 50:50 భాగస్వామ్యంగా అమెరికాకు చెందిన కింబర్లే-క్లార్క్ కో-ఆపరేషన్‌తో హెచ్‌యుఎల్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. హగ్గీస్, కోటెక్స్ బ్రాండ్లతో బేబీ కేర్, మహిళలకు సంబంధించిన వ్యాపారాన్ని ఈ జాయింట్ వెంచర్ నిర్వహిస్తోంది.