బిజినెస్

కార్తి చిదంబరం ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఐఎన్‌ఎక్స్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడయిన కార్తి చిదంబరం ఆస్తులను జప్తు చేసింది. భారత్, స్పెయిన్, బ్రిటన్‌లోని రూ. 54 కోట్ల విలువయిన అతని ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ గురువారం తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కొడైకెనాల్, ఊటీలోని వ్యవసాయ భూమి, బంగ్లా, దక్షిణ ఢిల్లీలోని జోర్బాగ్ ప్రాంతంలో కార్తి చిదంబరం, అతని తల్లి నళిని పేరిట గల రూ. 16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తిలో కార్తికి 50 శాతం వాటా ఉందని ఈడీ తెలిపింది. బ్రిటన్‌లోని సోమెర్‌సెట్‌లో ఏఎస్‌సీపీఎల్ పేరిట గల రూ. 8.67 కోట్ల విలువయిన కాటేజ్, ఇల్లును, స్పెయిన్‌లోని బార్సిలోనాలో గల రూ. 14.57 కోట్లకు పైగా విలువ గల టెన్నిస్ క్లబ్‌ను ఇవే ఆదేశాల కింద జప్తు చేసినట్లు ఈడీ వివరించింది. కాగా, ఈడీ తన ఆస్తులను జప్తు చేస్తూ జారీ చేసిన ఆదేశాలను కార్తి చిదంబరం తీవ్రంగా ఖండించారు. ఈడీ తీసుకున్న చర్య వాస్తవాల ప్రాతిపదికగా లేదని, అనాగరికంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఊహల ఆధారంగా తీసుకున్న వెర్రిబాగుల చర్య అంటూ ఆయన ఈడీ ఆదేశాలను విమర్శించారు. ప్రసార సాధనాల్లో సంచలనం సృష్టించడానికే ఈడీ ఈ ఆదేశాలు జారీ చేసిందని, ఈ ఆదేశాలు న్యాయస్థానం ఎదుట నిలబడవని పేర్కొన్నారు.
ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఈడీ ఆరోపిస్తున్న కంపెనీలలో తన క్లయింట్ అయిన కార్తి పి చిదంబరం వాటాదారుడు కాని డైరెక్టర్ కాని కాడని అతని తరపు న్యాయవాది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈడీ జారీ చేసిన జప్తు ఆదేశాలను తన క్లయింట్ కార్తి పి చిదంబరం అప్పిలేట్ అథారిటీలో సవాలు చేస్తారని ఆయన తెలిపారు. అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌సీపీఎల్) పేరిట చెన్నై బ్యాంకులో ఉన్న రూ. 90 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తులు కార్తి, ఏఎస్‌సీపీఎల్ పేరిట ఉన్నాయని, ఆ సంస్థ కార్తి చిదంబరంకు చెందినదేనని ఈడీ పేర్కొంది.