బిజినెస్

అంచనాలకు దరిదాపుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. టీసీఎస్ నికర లాభంపై విశే్లషకులు వేసిన అంచనాలకు దరిదాపుగా ఆ కంపెనీ గురువారం వెల్లడించిన గణాంకాలు ఉన్నాయి. టీసీఎస్ ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 7,902 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని విశే్లషకులు ఇదివరకే అంచనా వేశారు.
రెండో త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం తొలి త్రైమాసికంతో పోలిస్తే 7.6 శాతం, గత సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే 22.6 శాతం వృద్ధి చెందింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో టీసీఎస్ ఆర్జించిన ఆదాయం రూ. 36,854 కోట్లు. గత సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే టీసీఎస్ ఆదాయం 20.7 శాతం వృద్ధి చెందింది.‘టీసీఎస్ రెండో త్రైమాసికంలో అన్ని రకాలుగా పటిష్టమయిన పనితీరును ప్రదర్శించినందుకు మాకు సంతోషంగా ఉంది. డిజిటల్ లావాదేవీలకు డిమాండ్ పెరగడం వల్ల వ్యాపారం విస్తరించి ఆదాయ వృద్ధి పెరిగింది. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), రిటెయిల్ రంగాలలో వేగవంతమయిన వృద్ధి కొనసాగడం కూడా మా ఆదాయ వృద్ధికి దోహదపడింది’ అని టీసీఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గోపినాథ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టీసీఎస్ రూ. 7,340 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ కంపెనీ నాలుగు శాతం వాటాలను డివిడెండ్‌గా ప్రకటించింది. గురువారం స్టాక్ మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత టీసీఎస్ ఫలితాలు వెలువడ్డాయి. అంతకన్నా ముందు మార్కెట్‌లో టీసీఎస్ షేర్ల విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 2.4 శాతం దిగువన ముగిసింది.