బిజినెస్

బంగారం జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 13: ఈవారం మొత్తం స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే, బులియన్ మాత్రం జోరుగా పరుగులు తీసింది. మొదటి వారం 34,376.99 పాయింట్ల వద్ద మొదలైన సెనె్సక్స్ 34,474.38 పాయింట్ల వద్ద ముగిసింది. ఆతర్వాత వరుసగా 34,299.47 పాయింట్లు, 34,760.89 పాయింట్లు, 32,370.04 పాయింట్లు నమోదయ్యాయి. చివరిలో ఇది 34,733.58 పాయింట్లకు చేరుకోవడం మదుపరుల్లో వచ్చే వారం ట్రేడింగ్‌పై ఆశలు పెంచింది. అయితే, స్టాక్ మార్కెట్‌కు పూర్తి భిన్నంగా బులియన్ మార్కెట్ లాభాల బాటలో నడిచింది. ధరల పతనం పెద్దగా లేకపోవడం గమనార్హం. పది గ్రాముల బంగారం ఖరీదు గతవారంతంలో 31,900 రూపాయలుకాగా, ఈవారం ఆరంభంలో కొద్దిగా తగ్గి, 31,870 రూపాయలకు చేరింది. తొమ్మిదో తేదీన 31,650 రూపాయలకు పతనమైనప్పుడు, బంగారం మార్కెట్ దూకుడును కొనసాగించలేదేమోనన్న అనుమానాలు తలెత్తాయి. అయితే, ఆతర్వాత రెట్టించిన ఉత్సాహంతో పుంజుకుంది. పదోతేదీన31,850 రూపాయలకు వెళ్లిన 10 గ్రాముల బంగారం ధర, 11న 31,980 రూపాయలైంది. శుక్రవారం మరింత బలపడి, 32,120 రూపాయలుగా నమోదైంది. చివరిలో 70 రూపాయలు పతనమై, 32,050 రూపాయల వద్ద ముగిసింది. చిన్నపాటి ఒడిదుడుకులను పక్కకుపెడితే, బంగారం ధర నిలకడగా కొనసాగిందనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో, మదుపరులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపకుండా, బంగారంవైపు దృష్టి సారించాడు. దీనికితోడు, గతంలో ఎన్నడూ లేని రీతిలో డాలర్‌కు రూపాయి మారకపు విలువ అత్యంత కనిష్టానికి పడిపోవడం కూడా స్టాక్ మార్కెట్‌పై అనుమానాలకు కారణమైంది. ఫలితంగా ప్రత్యామ్నాయ మార్గంగా బంగారానే్న మదుపరులు ఎంచుకున్నారు. పైగా, పండగ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఆభరణాల తయారీదారుల నుంచి తాకిడి పెరిగింది.