బిజినెస్

పడిపోయిన రూపాయి మారకం విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడంతో పాటు క్రూడాయిల్ రేట్లు మరింత పెరిగిన నేపథ్యంలో మన దేశంలో షేర్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపరులు ఆయా షేర్లను పెద్దఎత్తున విక్రయించుకున్నారు.
ఈనెలలో గడిచిన రెండువారాల్లో విదేశీ ఇనె్వస్టర్లు షేర్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడుల్లో దాదాపు 26,600 కోట్ల రూపాయలు (3.6 బిలియన్ అమెరికా డాలర్లు) వెనక్కి తీసుకున్నారు. గత సెప్టెంబర్‌తో పోల్చి చూస్తే ఈ పెట్టుబడుల ఉపసంహరణ భారీగానే ఉంది. గతనెలలో 21వేల కోట్ల రూపాయల వరకు షేర్లను విదేశీ పెట్టుబడిదారులు విక్రయించారు. ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో విదేశీ మదుపరులు షేర్లలో పెట్టిన పెట్టుబడులు (ఈక్విటీ, రుణం) దాదాపు 74వేల కోట్ల రూపాయలు. తాజా నివేదిక ప్రకారం.. ఈనెల 1 నుంచి 12 మధ్య కాలంలో 17,935 కోట్ల రూపాయల ఈక్విటీలను, 8,645 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ రకాల బాండ్లను మొత్తంగా కలిపి 26,580 కోట్ల రూపాయలు (3.6 బిలియన్ అమెరికా డాలర్లు) విదేశీ మదుపరులు భారత షేర్ మార్కెట్ల నుంచి విక్రయించారు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం ఒకటి రెండు నెలలు మినహాయించి మిగిలిన అన్ని నెలల్లోనూ విదేశీ మదుపరులు తమ షేర్లను భారీగానే విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, ఈనెలలో గడిచిన రెండు వారాల్లో జరిపిన పెట్టుబడుల ఉపసంహరణ షేర్ మార్కెట్‌ను కాస్తంగా వణికించిందనే చెప్పాలి. అమెరికా-చైనా మధ్య వాణిజ్యపరంగా జరుగుతున్న పోరు కూడా విదేశీ ఇనె్వస్టర్లు తమ షేర్లను భారీగానే అమ్ముకునేందుకు కారణమై ఉండొచ్చునని జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చి హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గత వారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీసుకున్న చర్యలు కూడా ఇందుకు దోహదపడినట్టు తెలుస్తోంది. ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా కోశాగారానికి వస్తున్న రాబడులు వంటి అంశాలు ప్రపంచ విపణిలో డాలర్ చెలామణిని కట్టడి చేస్తున్న నేపథ్యంలో విదేశీ మదుపరులు తమ షేర్లను భారీగా విక్రయించుకోవడానికి ఇవి కూడా ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.