బిజినెస్

ఆశాజనకంగా మార్కెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఈవారం మార్కెట్ ఆశాజనకంగానే ఉంటుందని నిపుణులు జోస్యం చెప్తున్నారు. మార్కెట్ పరిస్థితులను ముడి చమురు ధరలు, రూపాయి మారకపు విలువ వంటి అంశా లు ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. గడచిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థల రాబడి, డాలర్‌కు భారత రూపా యి విలువ, క్రూడాయిల్ ధరలు వంటి అంశాలు సెలవులతో కూడిన ఈవారం మార్కెట్ పరిస్థితులను నిర్దేశించనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వచ్చే గురువారం దసరా పండుగను పురస్కరించుకుని స్టాక్ మార్కెట్లకు సెలవు. కాగా ‘ప్రస్తుతానికి మార్కెట్ల పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ఈ క్రమంలో మదుపర్లు రాబోయే త్రైమాసికానికి మంచి లాభాలను ఆశిస్తారు. అయితే ఈ పరిస్థితి కొనసాగింపు మాత్రం బాండ్లు ఎంత బలమైన ప్ర యోజనాలను చేకూరుస్తాయన్న అంశంపై ఆధారపడివుంటుంది’ అని వారంటున్నారు. అయితే అమెరికా మార్కెట్ ధరల పెంపు, చైనా-అమెరికా వాణి జ్య వివాదం, రాబోయే రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా దేశంలోని రాజకీయ అనిశ్చితి అంశాలు ఆందోళనకరంగా మారాయని, ఇవి మార్కెట్ సెంటిమెంట్‌ను వచ్చే త్రైమాసికంలోప్రభావితం చేసే అవకాశాలున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇన్ఫోసిస్, ఫెడరల్ బ్యాంకు, ఎసీసీ, రిలయన్స్ వంటి కంపెనీలు ఈ వా రంలో లాభనష్టాలను ప్రకటించాల్సి వుందని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు.