బిజినెస్

తగ్గిన డీజిల్ వినియోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో డీజిల్ వినియోగం తగ్గింది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షర సత్యం. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి స్వల్పంగా పెరిగినప్పటికీ, మొత్తం మీద తగ్గుదల నమోదు కావడం విశేషం. గత ఏడాది ఆగస్టలో 5,921 మెట్రిక్ టన్నుల మేర డీజిల్ వినియోగం జరిగింది. ఆతర్వాత క్రమంగా పెరుగుతూ, నవంబర్ నాటికి రికార్డు స్థాయిలో 7,225 మెట్రిక్ టన్నులకు చేరింది. డిసెంబర్‌లో కొంత తగ్గి, 7,116 మెట్రిక్ టన్నుల వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరిలో డీజిల్ వినియోగం 6,645 మెట్రిక్ టన్నులుకాగా, ఫిబ్రవరిలో 6,532కు తగ్గింది. కానీ, ఆ వెంటనే భారీగా పెరిగింది. మార్చిలో 7,347, ఏప్రిల్‌లో 7,156 మెట్రిక్ టన్నుల వినియోగం జరిగింది. మే మాసంలో, గతంలో ఎన్నడూ లేనంతగా 7,546 మెట్రిక్ టన్నుల డీజిల్ వినియోగం నమోదైంది. జూన్ (7,326), జూలై (6,610) మాసాల్లో తగ్గుతూ వచ్చి, ఆగస్టులో 6,171 మెట్రిక్ టన్నులతో ముగిసింది.

సరకు రవాణాలో వైజాగ్‌కు నాలుగో స్థానం
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: సరుకు రవాణాలో విశాఖపట్నం ఓడరేవు నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో దేశంలోని మేజర్ పోర్ట్స్ ద్వారా 343.26 మిలియన్ టన్నుల సరకు రవాణా అయింది. దీన్‌దయాల్ పోర్టు 58.63 మిలియన్ టన్నులతో మొదటి స్థానాన్ని ఆక్రమించగా, పారదీప్ 52.90, జేఎన్‌పీటీ 34.81 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. నాలుగో స్థానంలో ఉన్న విశాఖపట్నం ఓడరేవు నుంచి 31.76 మిలియన్ టన్నుల మేర సరుకు రవాణా జరిగింది. ఇతర మేజర్ పోర్ట్స్ విషయానికి వస్తే కోల్‌కతా (29.97), కామరాజర్ (16.57), చెన్నై (27.34), వీవో చిందంబర్‌నగర్ (16.78), కొచ్చిన్ (15.91), న్యూ మంగళూరు (20.18), మోర్ముగావ్ (9.23), ముంబయి (29.19) ఓడ రేవుల నుంచి కూడా సరుకు రవాణా మెరుగుపడింది.