బిజినెస్

ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. టర్కీ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఐరోపా మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాల మధ్య సూచీలు క్షీణించాయి. నిజానికి ఉదయం లాభాలతోనే ఆరంభమైనప్పటికీ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. మదుపరులు లాభాల స్వీకరణ దిశగా వెళ్లడంతో ఆరంభంలో 150 పాయింట్ల వరకు పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్.. 89.94 పాయింట్లు పతనమై 27,746.66 వద్ద ముగియాల్సి వచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 32.70 పాయింట్లు దిగజారి 8,508.70 వద్ద స్థిరపడింది. టెలికామ్ షేర్లు అత్యధికంగా 3.23 శాతం నష్టపోగా, చమురు, గ్యాస్ రంగాల షేర్లు 1.61 శాతం, రియల్టీ 1.32 శాతం, ఎనర్జీ 1.10 శాతం, మెటల్ 1.04 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 0.96 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.63 శాతం చొప్పున క్షీణించాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ సూచీలు 0.12 శాతం నుంచి 0.68 శాతం లాభపడగా, చైనా సూచీ మాత్రం 0.35 శాతం పడిపోయింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 0.40 శాతం, 0.19 శాతం మేర నష్టపోగా, బ్రిటన్ 0.35 శాతం లాభపడింది.