బిజినెస్

బంగారానికి మెరుపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: గత వారం చివరిలో పతనమైన బంగారం ధర సోమవారం మళ్లీ పుంజుకుంది. ఆభరణాల తయారీదారులు, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఏర్పడిన డిమాండ్ కారణంగా 10 గ్రాముల బంగారం 200 రూపాయల మేర పెరిగి, 32,250 రూపాయలుగా స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా పుత్తడి ధర పెరగడానికి సహకరించాయి. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధ ఫలితంగా చైనాలో ఆర్థిక వృద్ధి కుంటుపడుతుందన్న అనుమానాలు స్టాక్ మార్కెట్‌ను కుదిపేశాయి. మదుపరులు స్టాక్స్ కంటే బంగారంపై పెట్టుబడులపై మొగ్గు చూపారు. అందుకే, సోమవారం ఉదయం మార్కెట్ లావాదేవీలు మొదలైన వెంటనే, బంగారం ధర కొద్దిగా పెరిగింది. మధ్యాహ్నం కొంత వెనుకబడినప్పటికీ, సాయంత్రం మళ్లీ మెరుగుపడి, మొత్తం మీద రెండు వందల రూపాయల వరకూ పెరిగింది. ఇలావుంటే, వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి 350 రూపాయలు పెరిగి 39,750 రూపాయల వద్ద ముగిసింది. పది గ్రాముల బంగారానికి గత వారం అత్యధిక ధర 32,120 రూపాయలుకాగా, అత్యల్పం 31,650 రూపాయలు. అదే విధంగా వెండి అత్యధికం 39,500, అత్యల్పం 39,000 రూపాయలు.