బిజినెస్

పుంజుకున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గత వారం ఆరంభంలో వరుస నష్టాలతో అల్లాడినప్పటికీ, చివరిలో కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఈవారం ఆరంభంలో పుంజుకున్నాయి. సెనె్సక్స్ సుమారు 132 పాయింట్లు పెరిగి, 34,865.10 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం మొదట్లో జరిగిన లావాదేవీలతో పోలిస్తే, సోమవారం పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకుల ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో పెరగలేదు. ముడి చమురు ధరలు పెరగడం, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న స్తబ్దత వంటి కారణాలతో సెనె్సక్స్ పాయింట్ల పెరుగుల అంతంత మాత్రంగానే కనిపించింది. వారం ఆరంభంలో కొంత పుంచుకోవడంతో, క్రమంగా బలపడి, వారాంతంలో భారీగా పెరుగుదల ఖాయమని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి, 10,512.50 పాయింట్లకు చేరింది.
ఆసియా మార్కెట్ మొత్తం నిరాశాజనంగా కొనసాగుతున్నది. క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతోపాటు, అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల ఆసియా మార్కెట్లు నీరసించాయి. ఫలితంగా భారత స్టాక్ మార్కెట్ సైతం ఒడిదుడుకులకు లోనవుతున్నది. ఈ పరిస్థితుల్లో సోమవారం 131.52 పాయింట్లు పెరగడం భారత్ స్టాక్ మార్కెట్‌కు కొంతలో కొంత ఊపిరి పోసింది. రూపాయి మారకపు విలువ ఆశాజనకంగా లేకపోవడం కూడా మార్కెట్ లావాదేవీలు మందకొడిగా సాగడానికి ఒక కారణం. 3ప్రపంచ మార్కెట్‌లోనే అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. సహజంగానే ఈ పరిణామం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. ఈవారం ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ, ఎప్పుడు ఏ విధంగా మారతాయో చెప్పే పరిస్థితి లేదు. రూపాయి విలువ మెరుగుపడితే తప్ప మదుపరుల్లో ఉత్సాహం పెరగదు. లేకపోతే, మార్కెట్ మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదు2 అని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పరిశోధనా విభాగం చీఫ్‌గా వ్యవహరిస్తున్న వినోద్ నాయర్ పీటీఐతో మాట్లాడుతూ అన్నారు. ఈ వారం ప్రారంభంలోనే ఇంట్రా ట్రేడ్‌లో డాలర్ విలువ 74.05 రూపాయలుగా నమోదైంది. రూపాయి ఇంకా ఒత్తిడిలోనే ఉందని, తక్షణ చర్యలు తీసుకోకపోతే, మార్కెట్ మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్లాలజీ రంగాలపై దేశీయ పెట్టుబడిదారులు ఆసక్తి చూపడంతో కొంత మెరుగైన పరిస్థితి కనిపించింది. లేకపోతే, నష్టాల్లో ముగిసేది. సోమవారం ఇన్ఫోసిస్ స్టాక్స్ లాభాల పంట పండించాయి. షేర్ విలువ 2.95 శాతం పెరిగింది. ఐటీసీ 2.51 శాతం, ఓఎన్‌జీసీ 1.78 శాతం, టీసీఎస్ 1.60 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. సన్ ఫార్మా (1.50 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (1.46 శాతం), విప్రో (1.39 శాతం), రిలయన్స్ (1.19 శాతం), టాటా మోటార్స్ (0.49 శాతం), ఎన్‌టీపీసీ (0.30 శాతం) కూడా లాభాలను ఆర్జించిన కంపెనీల జాబితాలో చేరాయి. కాగా, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలోని కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ రంగంలో షేర్స్ సగటున 1.21 శాతం నష్టపోయాయి. సెనె్సక్స్‌లో నష్టపోయిన కంపెనీల్లో హెచ్‌యూఎల్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్, వేదాంత గ్రూప్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. అదే విధంగా నిఫ్టీలో రెడ్డీ ల్యాబ్స్, సిప్లా, ఇన్ఫోసిస్, హిందాల్‌కో, ఐటీసీ లాభపడితే, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్, మహీంద్ర అండ్ మహీంద్ర, గెయిల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.