బిజినెస్

వంట నూనె మార్కెట్‌లో పది శాతం మా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: భారత దేశంలోని వంట నూనె మార్కెట్‌లో కనీసం పది శాతాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్నామని కార్గల్ ఇండియా కంపెనీ ప్రకటించింది. ఇందు కోసం భారీ పెట్టుబడులను సిద్ధం చేసుకున్నట్టు తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అమెరికాకు చెందిన కార్గిల్ కంపెనీ మన దేశంలో నేచర్ ఫ్రెష్, జెమినీ, స్వీకార్, లియోనార్డో ఆలివ్ ఆయిల్, రథ్ వంటి బ్రాండ్లతో వంట నూనెలను మార్కెట్ చేస్తున్నది. తాజాగా ‘నేచర్‌ఫ్రెష్ యాక్టీ హార్ట్’ పేరుతో మరో బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కనోలా, రైస్ బ్రాన్ ఆయిల్స్‌తో సమానమైన సమ్మేళనంతో ఈ నూనెను తయారు చేసినట్టు కార్గిల్ కంపెనీకి భారత్‌లో అమ్మకాలు, మార్కెటింగ్ విభాగం డైరెక్టర్‌గా ఉన్న మిలింద్ పింగిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని, పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. అదే సమయంలో, నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించమే తమ లక్ష్యమని అన్నారు. అందుకే, గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా నిలువరించే రీతిలో ‘నేచర్‌ఫ్రెష్ యాక్టీ హార్ట్’ను తయారు చేశామని చెప్పారు. దేశంలో వంట నూనె మార్కెట్ చాలా విస్తారమైనదని, అందులో పది శాతాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ దిశగా అదనపు పెట్టుబడులతో ఉత్పత్తులను పెంచుతామని అన్నారు. మార్కెట్‌లో నంబర్ వన్‌గా నిలవడమే తమ ధ్యేయమన్నారు.