బిజినెస్

కొనసాగిన బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: ఈవారం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్‌లో రెండో రోజున కూడా బుల్ రన్ కొనసాగింది. లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 297.38 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. గత వారం చివరిలో కోలుకున్న స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాటలో నడిచిన విషయం తెలిసిందే. మంగళవారం మార్కెట్ మరికొంత పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకుల ప్రభావం భారత మార్కెట్‌పై అంతగా లేదనే చెప్పాలి. మదుపరులు, కంపెనీ యమానులు కోరుకున్న రీతిలో విపరీతమైన వేగాన్ని అందుకోలేక పోయినప్పటికీ, సుమారు మూడు వందల పాయింట్లు పెరగడంతో, సెనె్సక్స్ మరోసారి 35,000 మైలురాయిని అధిగమించింది. ముడి చమురు ధరలు పెరుగుదలను అరికట్టడానికి వివిధ దేశాలతో కేంద్రం సాగిస్తున్న చర్చలు అంతంతమాత్రంగానే ఫలిస్తున్నాయి. దీని ప్రభావం మార్కెట్‌పై పడింది. లేకపోతే, బుల్ రన్ మరింత జోరుమీద ఉండేది. మంగళవారం ఉదయం లాభాలను పండించి, మధ్యాహ్నానికి స్వల్పంగా పతనమైన సెనె్సక్స్ చివరి సెషన్‌లో పుంజుకొని, 35,162.79 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 72.25 పాయింట్లు పెరిగి, 10,584.75 పాయింట్లతో ముగిసింది. ఒకానొక దశలో నిఫ్టీ 10,604.90 పాయింట్లకు చేరినప్పటికీ, చివరి వరకూ అదే కొరవడి కొనసాగలేదు.
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ పెట్టుబడులను ఆకర్షించలేకపోయినప్పటికీ, చిన్న, మధ్య తరహా మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో ఆశాజనకంగానే కొనసాగింది. స్థూలంగా చూస్తే, ప్రపంచ మార్కెట్ మాదిరిగానే, భారత స్టాక్ మార్కెట్ కూడా ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. అయితే, అమెరికా మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తే, భారత్‌కు అలాంటి పరిస్థితి రాలేదు. కాగా, ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు నష్టాల నుంచి కోలుకోవడం విశేషం.
స్టాక్ మార్కెట్‌లో మంగళవారం జరిగిన లావాదేవీల్లో మహీంద్ర అండ్ మహీంద్ర (3.7 శాతం), అదానీ పోర్ట్స్ (3.54 శాతం), ఓఎన్‌జీసీ (3.44 శాతం), ఎస్‌బీఐ (2.60 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (2.51 శాతం), యాక్సిస్ బ్యాంక్ (2.25 శాతం), రిలయన్స్ (2.09 శాతం), ఏషియన్ పెయింట్స్ (1.62 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (1.32 శాతం), ఎస్ బ్యాంక్ (1.18 శాతం) లాభపడ్డాయి. కాగా, బజాజ్ ఆటో (0.54 శాతం), మారుతీ సుజికీ (0.45 శాతం), ఇన్ఫోసిస్ (0.35 శాతం), ఇండస్‌ఇండ్ (0.37 శాతం), ఎన్‌టీపీసీ (0.33 శాతం), పవర్ గ్రిడ్ (0.11 శాతం), విప్రో (0.08 శాతం) చొప్పున నష్టాలను చవిచూశాయి.