బిజినెస్

బక్షీ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సందీప్ బక్షీ నియామకానికి ఆర్‌బీఐ ఆమోద ముద్ర వేసింది. ఆయన ఈ పదవుల్లో మూ డేళ్లు ఉంటారు. చందన్ కొచ్చర్ రాజీనామా చేయడంతో, ఆ పదవుల్లో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వచ్చింది. అప్పటి వరకూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పని చేస్తున్న బక్షీకి అవకాశం ఇవ్వాలని పాలక మండలి తీర్మానించింది. నిబంధనల ప్రకారం ఈ నియామకాన్ని ఆమోదం కోసం ఆర్‌బీఐకి పంపింది. మంగళ వారం అక్కడి నుంచి అధికారిక ప్రకటన వెలువడడంతో, బీసీసీఐ ఎండీ, సీఈవోగా బక్షీ 2023 అక్టోబర్ 3వ తేదీ వరకు వ్యవహరిస్తారు. ఈ గ్రూప్‌లో 1986లో చేరిన బక్షీ అంచెలంచెలుగా ఎదిగారు.