బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీలో ఎన్‌ఐఐఎఫ్ పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీలో పెట్టుబడి పెట్టనున్నట్టు నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) ప్రకటించింది. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలలు నెరవేర్చడానికి హెచ్‌డీఎఫ్‌సీ రియల్ ఎస్టేట్ క్యాపిటల్ విభాగంలో 660 కోట్ల రూపాయలను పెట్టుబడిగా ఉంచుతామని పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ విభాగంగా పని చేస్తున్న క్యాపిటల్ ఎఫొర్డబుల్ రియల్ ఎస్టేట్-2 (హెచ్-కేర్ 2)లో అబూదబీ ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) భారీగా పెట్టుబడులు పెట్టింది. కేటగిరి 2లో ప్రత్యామ్నాయ పెట్టుబడిగా 4,290 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. మధ్య, దిగువ స్థాయిల్లో ఉన్న ప్రజలు ఇళ్లు కొనుక్కోవడానికి వీలుగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో పేదరికం తగ్గుతూ, మధ్య తరగతి ప్రజల సంఖ్య గణనీయంగా పెరగడంతో, ఆ దిశగా ఎన్‌ఐఐఎఫ్ దృష్టి సారించింది. హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు మరింత ఊతమిచ్చేందుకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ‘2022 సంవత్సరానికి అందరికీ ఇళ్లు’ అనే ప్రభుత్వ నినాదాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. ఈ లక్ష్య సాధనలో తమ ప్రయాణానికి సానుకూల ధోరణి కనిపిస్తున్నదని చెప్పారు.