బిజినెస్

భయపెడుతున్న ‘ఆహార’ ద్రవ్యోల్బణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణ రేటు యావత్ దేశాన్ని భయపెడుతున్నది. ధాన్యాలు, పప్పులు, బియ్యం, గోధుమలు, కాయకూరలు.. ఇలా ఒకటిరెండు అని చెప్పడానికి వీల్లేకుండా అన్నిటి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దసరా పండుగ వచ్చేస్తున్నది. త్వరలోనే దీపావళి రానుంది. ఈ రెండు వరుస పండుగలను ఎంతో గొప్పగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే, ఈసారి పండుగలను పెరుగుతున్న ధరలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. దసరా, దీపావళి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రజలు, ఇప్పుడు పండుగలు ఎందుకు వస్తున్నాయని భయపడే పరిస్థితి. ఈ ఏడాది ప్రారంభం నుంచి అన్ని రకాల ధాన్యాలు, పప్పులు, వరి తదితరాల ధరలు పెరుగుతునే ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, సెప్టెంబర్‌లో మళ్లీ పెరగడం, అక్టోబర్‌లో ఇంత వరకూ ధరలు తగ్గే సూచనలు కనిపించకపోవడం ఆందోళనకు కారణమవుతున్నది. జీఎస్టీ అమలు తర్వాత, పన్నుల విధానంలో చోటు చేసుకున్న మార్పులకు పూర్తిగా అలవాటు పడని కారణంగా ధరలు పెరిగినట్టు విశే్లషకులు అభిప్రాయపడ్డారు.
ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 0.95 శాతంకాగా, మార్చిలో మరింతగా తగ్గి, 0.29 శాతానికి చేరింది. అయితే, ఏప్రిల్‌లో 0.87 శాతానికి, మేలో 1.74 శాతానికి పెరిగింది. జూన్‌లో అత్యధికంగా 1.87 శాతంకాగా, జూలైలో -2.10, ఆగస్టులో -4.04 శాతంగా నమోవదైంది. ఈ పరిణామం హర్షణీయమని, ఇదే ఒరవడి కొనసాగి, ధరలు పడిపోతాయని అంతా ఊహించారు. కానీ, రూపాయి మారకపు విలువ పడిపోవడంతోపాటు, డిమాండ్ పెరగడంతో, ఆహార ద్రవ్యోల్బణం మరోసారి ప్రమాద స్థాయికి చేరే దిశగా ముందుకు వెళుతున్నది. వివిధ వస్తువుల ధరల పెరుగుదలను గమనిస్తే, ఆహార ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో సులభంగా అర్థమవుతుంది. అన్ని ధాన్యాల ధరలు సగటున 5.54 శాతం పెరిగాయి. బియ్యం ధరలో 4.64 శాతం పెరుగుదల నమోదైంది. గోధుమలు ఒకేసారి 8.87 శాతం పెరిగి, సామాన్యుడిని భయాందోళనకు గురిచేస్తుండగా, అన్ని రకాల పప్పు ధాన్యాల ధరలు కూడా పెరిగాయి. కూరగాయలు, పండ్లు తదితరాల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. పండుగలు వచ్చినప్పుడు ధరల్లో పెరుగుదల సామాన్యం. అయితే, ఇంత భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రత్యేకించి వెంటవెంటనే వచ్చే దసరా, దీపావళి సమయంలో ధరలు ఎవరికీ అందుబాటులో లేనంత ఎత్తున కూర్చోవడంతో సామన్యుడు దిగాలు పడుతున్నాడు. ఒక్క రోజులో ధరలు తగ్గే అవకాశం లేకపోయినా, కనీసం దీపావళి నాటికైనా ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.