బిజినెస్

చైనా స్టీల్ ఉత్పత్తులపై సుంకాన్ని పెంచిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: స్టీల్ పరిశ్రమలో దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే చైనా నుంచి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ పన్నులను విధించింది. ఐదేళ్ల కాల పరిమితితో, టన్నుకు 185.51 డాలర్ల పన్నును విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) ఇటీవల చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర రెవెన్యూ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నోటిషికేషన్ ప్రకారం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ఉషా మార్టిన్, గెర్డా స్టీల్ ఇండియా, వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్, యజస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్ తదితర కంపెనీలు చైనా స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని డీజీటీఆర్‌కు సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి. అన్ని కోణాల్లోనూ సమస్యను అధ్యయనం చేసిన డీజీటీఆర్ చైనా ఉత్పత్తులపై సరైన నియంత్రణ లేకపోతే దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ ఉందన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే, భారత స్టీల్ మార్కెట్‌లో అత్యధిక వాటాను కలిగివున్న చైనా నుంచి దిగుమయ్యే ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ పన్నును విధించాలని సూచించింది. డీజీటీఆర్ ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.