బిజినెస్

ఆన్‌లైన్‌లో జంతువుల అక్రమ అమ్మకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: అరుదైన జంతువులు, వాటి శరీర భాగాల అమ్మకాలు క్వికర్, ఒఎల్‌ఎక్స్, ఈబే, అమెజాన్, యూట్యూబ్ తదితర ప్రముఖ వెబ్‌సైట్లలో జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. సైబర్ నేరాల అదుపులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరుదైన జంతువులు, వాటి శరీర భాగాల ఆన్‌లైన్ స్మగ్లింగ్‌పై నిఘా పెట్టాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే తెలిపారు.
ఈ క్రమంలో కొన్ని వెబ్‌సైట్లు అరుదైన జంతువులు, వాటి శరీర భాగాల అమ్మకపు ప్రకటనలు చేస్తూ కనిపించాయని దవే సోమవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. ఇలా మొత్తం 106 వెబ్‌సైట్లను వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యుసిసిబి) ద్వారా గుర్తించినట్లు చెప్పారు.
ఇందులో క్వికర్‌డాట్‌కామ్, ఒఎల్‌ఎక్స్‌డాట్‌ఇన్, అలీబాబాడాట్‌కామ్, ఈబేడాట్‌కామ్, యూట్యూబ్‌డాట్‌కామ్, అమెజాన్‌డాట్‌కామ్, షాపింగ్‌డాట్‌రెడిఫ్‌డాట్‌కామ్, పెట్స్‌మార్ట్‌డాట్‌కామ్, స్నాప్‌డీల్‌డాట్‌కామ్ వంటి ప్రముఖ వెబ్‌సైట్లు ఉన్నట్లు తెలిపారు. వీటిపై తగినవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.