బిజినెస్

అదే దూకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: బంగారం ధరలు వేగంగా ముందుకు దూసుకెళుతూ, బులియన్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. గత మూడు వారాల్లో పెరిగిన బంగారం ధర వరుసగా నాలుగో వారం కూడా అదే దూకుడును కొనసాగించింది. స్థూలంగా చూస్తే, ఈవారం పది గ్రాముల బంగారం ధర 225 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర 200 రూపాయలు అధికమైంది. పండుగ రోజులు కావడంతో, దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఏర్పడడంతో, ఈవారం కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. రూపాయి దారుణ పతనం తర్వాత ఈవారం కొద్దిగా కోలుకున్నప్పటికీ, మదుపరులు ఎక్కువ బంగారాన్ని కొనేందుకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ కారణంగా బంగారానికి డిమాండ్‌తోపాటు దిగుమతలు కూడా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పసిడి దిగుమతి 17.63 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి దిగుమతి చేసుకున్న బంగారం విలువ 16.96 బిలియన్ డాలర్లు. ముడి చమురు తర్వాత మన దేశం దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల్లో బంగారం రెండో స్థానంలో ఉంది. ఏటా సుమారు 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతి అవుతున్నది. చాలాకాలంగా ఇదే ఒరవడి కొనసాగుతున్నది. ఈవారం కూడా బులియన్ మార్కెట్‌లో ఇదే పరిస్థితి కనిపించింది. బంగానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ పసుపు లోహాన్ని కొనేందుకు పెట్టుబడిదారులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వ్యక్తుల నుంచి కూడా డిమాండ్ ఏర్పడుతున్నది. శనివారంతో ముగిసిన ఈవారం బులియన్ మార్కెట్‌లో బంగారం దూకుడు స్పష్టంగా కనిపించింది.