బిజినెస్

బంగారానికి తగ్గని డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: దసరా పండుగ తర్వాత కూడా మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. పది గ్రాముల బంగారం ధర శనివారం మరో 45 రూపాయలు పెరిగి, 32,270 రూపాయలకు చేరింది. స్థానిక నగల తయారీదారుల నుంచి ఆర్డర్లు పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో బంగారం ధర దాదాపుగా క్రమం తప్పకుండా పెరుగుతునే ఉంది. బంగారంతోపాటు వెండి డిమాండ్ కూడా తగ్గలేదు. కిలో వెండి ధర 100 రూపాయలు పెరగడంతో, 39,600 రూపాయలకు చేరుకుంది. దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ, దీపావళి రానుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతునే ఉన్నాయన్నది వాస్తవం. పది రోజుల బులియన్ మార్కెట్‌ను పరిశీలిస్తే, ఈనెల 13వ తేదీన పది గ్రాముల బంగారం అత్యంత తక్కువగా 32,050 రూపాయలుగా నమోదైంది. ఆతార్వత క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే, 17న మరోసారి ధర పతనమై, 32,030 రూపాయలకు చేరింది. కానీ, ఆతర్వాత మళ్లీ లాభాల బాటను అందుకుంది. స్థూలంగా చూస్తే ఇటీవల కాలంలో పది గ్రాముల బంగారం ధర ఏ దశలోనూ 32,000 రూపాయలకు తగ్గకపోవడం గమనార్హం.