బిజినెస్

నీరసించిన బుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 20: ఈవారం స్టాక్ మార్కెట్ నిరాశజనకంగా కొనసాగింది. గత వారం మొదట్లో ఎదురైన నష్టాల నుంచి చివరిలో కొంత వరకూ బయటపడినప్పటికీ, ఈవారం మరోసారి నష్టాలనే చవిచూసింది. సెనె్సక్స్ సూచీల పతనానికి అనేకానేక అంశాలు కారణమయ్యాయి. రూపాయి మారకపు విలువను పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు మదుపరులకు నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. అదే విధంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్య లబ్ధతపై నెలకొన్న అనుమానాల నుంచి మార్కెట్ బయటపడలేదు. ద్రవ్యాన్ని మరింత అందుబాటులో ఉంచేందుకు హెడ్‌డీఎఫ్‌సీ హౌంగ్ విభాగంలో భారీగా షేర్లు కొనేందుకు ఆర్‌బీఐ తీర్మానించినప్పటికీ ఫలితం లేకపోయింది. అదే విధంగా రూపాయి మారకపు విలువ పతనం కొనసాగడం కూడా ఈవారం స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమైంది. డాలర్‌కు రూపాయి కొద్దిగా మెరుగుపడినా, పూర్తి స్థాయిలో నమ్మకాన్ని పొందలేకపోయింది. ఫలితంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా తమ షేర్లను అమ్మేశారు. విదేశీ మారకం పెద్ద మొత్తంలో తరలి వెళ్లడంతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. ఈవారం స్టాక్ మార్కెట్‌లో వాణిజ్య లోటు కూడా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఇన్ఫోసిస్ వంటి భారీ కంపెనీల షేర్లు పతనాన్ని చవిచూడడం స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. ఈ పతనాన్ని ఎవరూ ఊహించకపోవడంతో, ముందస్తు చర్యలకు, నిర్ణయాలకు తగినంత సమయం లేకపోయింది. రూపాయి పతనానికి భారీ కంపెనీల షేర్ల పతనం కూడా తోడు కావడంతో స్టాక్ మార్కెట్ నీరసించిపోయింది. వారాంతంలో 35,000 పాయింట్ల సూచీని దాటలేకపోవడం సెనె్సక్స్ పతనానికి అద్దం పడుతుంది. రిల్‌తోపాటు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కూడా సగటున 4.2 శాతం పతనమయ్యాయి. స్థూల మార్కెట్ సూచీలు అంతర్జాతీయ స్థాయిలోనే పతనం వైపు పరుగులు తీయడంతో, ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) ద్రవ్య లబ్ధతను పెంచేందుకు మరికొన్ని చర్యలు తీసుకుంటున్నదని ఆర్‌బీఐ ప్రకటించింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో పెరుగుతున్న రుణ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వ సెక్యూరిటీలను వినియోగించాల్సిందిగా సెంట్రల్ బ్యాంక్ సూచించింది. ద్రవ్య లబ్ధత, రుణ భారం దామాషాను సరి చూసుకుంటూ, ముందస్తు చర్యలకు ఆర్‌బీఐ సంసిద్ధమైంది. అయితే, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు, ప్రకటించిన ప్రణాళికలు మదుపరులను ఆకట్టుకోలేదు. రూపాయి మారకపు విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలకు రెక్కలు రావడం వంటి అంశాలు సహజంగానే మార్కెట్‌ను శాసించాయి. ప్రభుత్వ రంగ సంస్థలయిన చమురు, సహజ వాయువు కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఐఎల్) ఉత్పత్తి తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇది వరకే సమీక్షించారు. చమురు దిగుమతులను పది శాతం తగ్గించుకోవాలనే లక్ష్యాన్ని సాధించడానికి దేశీయంగా చమురు ఉత్పత్తిని అంచనా వేసేందుకు ప్రధాని ఈ రెండు సంస్థలు స్వల్ప కాలికంగా, మధ్య కాలికంగా జరుపబోయే ఉత్పత్తిని పరిశీలించారు. విఓఎన్‌జీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశిశంకర్, ఓఐఎల్ చైర్మ న్, మేనేజింగ్ డైరెక్టర్ ఉత్పల్ బోరా తమ సంస్థలు వచ్చే అయిదేళ్ల కాలంలో ఉత్పత్తి చేయనున్న చ మురు పరిమాణం అంచనాలను ప్రధానికి వివరించినట్టు సమాచారం. ముడి చమురు ధరను తగ్గించి, సరఫరాలను పెంచాల్సిందిగా అరబ్ దేశా లకు మోదీ చేసిన సూచన ఆశించిన ఫలితం ఇవ్వ కపోవడంతో, స్టాక్ మార్కెట్‌కు కూడా పెట్రో దెబ్బ తప్పలేదు. ఇలావుంటే, స్టాక్‌మార్కెట్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్న ఆర్థిక నేరగాళ్లను పసిగట్టేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తగిన అధికారాలు ఇవ్వాలని సెబీ కేంద్రాన్ని కోరింది. ఆర్థిక నేరగాళ్ల ఫోన్‌కాల్స్, ఇమెయిల్స్‌ను కూడా ఈ వ్యవ స్థ ద్వారా పసిగట్టవచ్చు. పారదర్శకత, జవాబుదారీతనంతో కంపెనీలు వ్యవహరించేవిధంగా చూ సేందుకు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునేందుకు వీలుగా సెబీ చట్టాలను పదును పెట్టాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు చేసింది. ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్స్‌కు సవరణలు తేవాలని అధికారులు నిర్ణయించారు. కేంద్ర న్యాయ శాఖ మాజీ కార్యదర్శి , లోక్‌సభ పూర్వ సెక్రటరీ జనరల్ టీకే విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఈ సిఫార్సులను చేసింది. కాగా, ఈ ప్రతిపాదనలను సెబీ సమావేశంలో సమీక్షించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడే కంపెనీల కాల్స్‌ను పసిగట్టడమంటే, వ్యక్తిగత గోప్యతను అపహరించినట్లవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అయతే, రాజ్యాంగ సమ్మతం కాని ఈ నిర్ణయాలను అమలు చేస్తే చట్టపరమైన అవరోధాలు తలె త్తే అవకాశం ఉందన్న అనుమానం తలెత్తింది. అం దుకే అవసరమైతే ఈ విషయ మై కేంద్రం అనుమ తి తీసుకోవాలని నిర్ణయించాయి. ప్రభుత్వం నుం చి స్పందన లేకపోవడం స్టాక్ మార్కె ట్‌లో ఇన్‌సై డర్ ట్రేడింగ్‌పై నిఘా ఉంచే అవకాశా లకు గండి కొట్టింది. ఈవారం మార్కెట్‌పై ఇన్‌సైడర్ ట్రేడింగ్ తీరు ప్రభావాన్ని చూపడంతో నష్టాలు తప్పలేదు.