బిజినెస్

బలపడిన ఐదు కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలోని పది అత్యంత విలువయిన కంపెనీలలోని అయిదు కంపెనీల మార్కెట్ విలువ ఈ వారంలో రూ. 31,381.39 కోట్లు పెరిగింది. వీటిలో ఐటీసీ అత్యధికంగా లాభపడింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో హెచ్‌యూఎల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్‌జీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) పెరిగింది. మరోవైపు, టీసీఎస్, రిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ ఈ వారంలో నష్టపోయాయి. ఐటీసీ మార్కెట్ విలువ ఈ వారంలో రూ. 16,856.05 కోట్లు పెరిగి, రూ. 3,53,141.45 కోట్లకు చేరింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 5,749.62 కోట్లు పెరిగి, రూ 2,28,754.68 కోట్లకు చేరుకుంది. ఓఎన్‌జీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,941.25 కోట్లు పెరిగి, రూ. 2,06,679.25 కోట్లకు చేరుకుంది. హెచ్‌యూఎల్ ఎం-క్యాప్ రూ. 2,283.7 కోట్లు పెరిగి, రూ. 3,41,841.36 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ. 1,550.77 కోట్లు పెరిగి, రూ. 2,98,185.82 కోట్లకు చేరుకుంది. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) మార్కెట్ విలువ రూ. 15,687.72 కోట్లు పడిపోయి, రూ. 6,98,278.03 కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎం-క్యాప్ రూ. 8,928.55 కోట్లు తగ్గి, రూ. 2,85,319.16 కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3,586.68 కోట్లు పడిపోయి, రూ. 5,34,142.49 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ మార్కెట్ విలువ రూ. 2,231.14 కోట్లు తగ్గి, రూ. 2,32,797.87 కోట్లకు చేరింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 506.57 కోట్లు తగ్గి, రూ. 7,19,350.91 కోట్లకు చేరుకుంది. ఈ పది కంపెనీల ర్యాంకింగ్‌లలో టీసీఎస్ అగ్ర స్థానంలో నిలువగా, తరువాత స్థానాల్లో వరుసగా రిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్‌జీసీ ఉన్నాయి.