బిజినెస్

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: విదేశీ మదుపరులు ఈ నెల తొలి మూడు వారాలలో భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి సుమారు రూ. 32వేల కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. ప్రపంచ వాణిజ్య వివాదాలు తీవ్రం కావడం, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికాలో పెట్టుబడులపై ఆదాయాలు పెరగడం వంటి వాటి వల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి తమ నిధులను ఉపసంహరించుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో రూ. 21వేల కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు, ఆ నెలతో పోలిస్తే ఈ నెలలో ఇప్పటికే చాలా ఎక్కువ నిధులను ఉపసంహరించుకున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో కలిపి ఎఫ్‌పీఐలు భారత క్యాపిటల్ మార్కెట్లలో నికరంగా రూ. 7,400 కోట్ల పెట్టుబడులు పెట్టారు. తాజా డిపాజిటరి గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు అక్టోబర్ 1-19 మధ్య కాలంలో రూ. 19,810 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. అలాగే రూ. 12,167 కోట్ల విలువయిన బాండ్లను విక్రయించారు. మొత్తం రూ. 31,977 కోట్ల (4.3 బిలియన్ డాలర్ల) పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు రెండు నెలలు మినహాయించి ఈ సంవత్సరం అంతా నికర విక్రయదారులుగానే మిగిలారు. అయితే, ఎఫ్‌పీఐలు అక్టోబర్ నెలలో చాలా వేగంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మార్కెట్‌ను కుదిపివేసిందని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా- చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సెంటిమెంట్ వల్ల ఎఫ్‌పీఐలు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల మొదట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటును 3.7 శాతానికి తగ్గించడమూ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముడి చమురు ధర ల పెరుగుదల, అమెరికాలో పెట్టుబడులపై ఆదాయాలు పెరగడం, ప్రపంచ మార్కెట్‌లో డాలర్ లభ్యత జటిలం కావడం ఎఫ్‌పీఐలు నికర విక్రయదారులుగా మారడానికి దారితీశాయని బజాజ్ క్యాపిటల్ ఇనె్వస్ట్‌మెంట్ అనలిటిక్స్ అధిపతి, సీనియర్ వైస్ ప్రెసిడెం ట్ అలోక్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి భారత్ సహా, ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న అన్ని మార్కెట్లలోనూ ఈ సమస్య నెలకొందన్నారు.