బిజినెస్

ఇంటర్నెట్ ధరలను భారీగా తగ్గించిన ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: దేశీయ టెలికామ్ రంగంలో ధరల యుద్ధం మొదలైంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మొబైల్ సేవలను త్వరలో ప్రారంభించనున్న క్రమంలో భారతీ ఎయిర్‌టెల్‌తో పోటీపడి ఐడియా సెల్యులార్ 4జి, 3జి ఇంటర్నెట్ ధరలను భారీగా తగ్గించింది. దాదాపు 67 శాతం వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఆదివారం ఎయిర్‌టెల్.. ప్రీ-పెయిడ్ వినియోగదారులకు ఇప్పుడున్న ధరలకే 67 శాతం అధికంగా డేటాను ఇస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో ఇంతే స్థాయిలో డేటాను తమ 4జి, 3జి వినియోగదారులకు ప్రస్తుత ధరల్లోనే అందిస్తామని ప్రకటించింది ఐడియా. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం 2జిబి నుంచి 10జిబి ప్యాకేజీలను వాడే వినియోగదారులకు కలిసిరానుండగా, గత వారం 1జిబి దిగువన వాడే ఇంటర్నెట్ వినియోగదారులకూ ధరలను 45 శాతం తగ్గించింది ఐడియా. ప్రస్తుతం 10జిబి 4జి, 3జి డేటా ప్యాక్‌లను కేవలం 990 రూపాయలకే అందిస్తున్న ఐడియా.. 2జి డేటా ప్యాక్‌ను 349 రూపాయలకే ఇస్తోంది. ఇంతకుముందు దీని ధర 449 రూపాయలుగా ఉంది.
అంతేగాక ఐడియా వినియోగదారులు 5జి 4జి, 3జి డేటా ప్యాక్‌ను 649 రూపాయలకే అందుకోవచ్చు. అన్ని సర్కిళ్లలోని 4జి, 3జి ప్రీ-పెయిడ్ వినియోగదారులు కొత్త చార్జీలకు డేటాను పొందవచ్చని ఐడియా స్పష్టం చేసింది. ఇదిలావుంటే వచ్చే నెలలో హై-స్పీడ్ డేటా, 4జి వాయిస్ సేవలను రిలయన్స్ జియో ప్రారంభించనుంది. ఇప్పటికే పరిమిత స్థాయిలో సేవలను ట్రయల్ రన్ చేస్తున్నది తెలిసిందే. 2,999 రూపాయలకే ఎల్‌వైఎఫ్ స్మార్ట్ఫోన్లతో 4జి సిమ్ కార్డులను రిలయన్స్ జియో అందిస్తోంది.
సామ్‌సంగ్ ఫోన్లతోనూ జియో తమ సేవలను వినియోగదారులకు అందించనుండగా, భవిష్యత్తులో ఐఫోన్లకూ విస్తరించనుంది. తమ వినియోగదారులకు సిమ్ కార్డులతో 90 రోజులపాటు ఉచిత అపరిమిత 4జి మొబైల్ ఇంటర్నెట్‌ను, వాయిస్ కాలిం గ్ సౌకర్యాన్ని జియో అందిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ లీడరైన ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం ధరల యుద్ధానికి తెరలేపగా, ఐడియా దాన్ని కొనసాగించింది.
దీంతో రిలయన్స్ జియో మరింతగా డేటా ధరలను తగ్గిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, మిగతా టెలికామ్ సంస్థలూ ఈ తరహా ధరల విధానాన్ని అనుసరిస్తాయా? లేదా? అన్నది చూడాలి. మరోవైపు తాజా నిర్ణయాల నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో టెలికామ్ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఎయిర్‌టెల్ షేర్ విలువ 4 శాతం, ఐడియా షేర్ విలువ 6.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 0.82 శాతం చొప్పున పడిపోయింది.