బిజినెస్

మార్కెట్‌లోకి ‘డెస్టినీ 125సీసీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్ కలిగిన హీరోమోటోకార్ప్ సోమవారం సరికొత్త ఆవిష్కరణతో మనసు దోచుకుంది. 125సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో ‘డెస్టినీ 125సీసీ’ పేరిట కొత్త ఉత్పాదనను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ వాహనం రెండు రకాల ధరలతో అందుబాటులో ఉంటుంది. 54,650 రూపాయలు, 57,500 రూపాయల ఎక్స్‌షోరూం ధరలు కలిగిన ఈ స్కూటర్ సుజికీ ఆక్సెస్ 125, హోండా ఆక్టివా, హోండాగ్రేజియా, టీవీఎస్ ఎన్‌టార్క్‌లతో మార్కెట్‌లో పోటీపడనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధిక సామర్ధ్యం కలిగిన ఇంజన్లు కలిగిన స్కూటర్లకు అధిక డిమాండ్ ఉంది. ఈ యేడాది ప్రత్యేకించి 125 స్కూటర్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గత యేడాదితో పోలిస్తే ఇప్పటివరకు సుమారు 75 శాతం అధికంగా ఈ స్కూటర్ల విక్రయాలు జరిగాయని హీరో మోటోకార్ప్ గ్లోబల్ ప్రాడక్టు ప్లానింగ్ విభాగం హెడ్ మాలో లీ మాసన్ ఇక్కడ విలేఖరులకు తెలిపారు. అందుకే కంపెనీ ఈ విభాగం విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందుకు సంబంధించి మల్టీబ్రాండ్ దృక్ఫథంతో వ్యూహాన్ని అమలుచేస్తున్నామని, అందులో భాగంగానే ఈ ‘డెస్టినీ 125’ స్కూటర్‌ను విడుదల చేశామని, మరో స్కూటర్‌ను సైతం ఈ యేడాది చివరికల్లా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ స్కూటర్లను నెలకు లక్ష స్కూటర్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.