బిజినెస్

ఆరంభంలో పెరిగి.. తర్వాత తరిగి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 22: గత వారం క్రమంగా పతనమవుతూ, వారాంతంలో నీసరించిన బుల్ రన్‌కు కొత్త వారం మొదట్లో అద్భుతమైన ఊపు లభిస్తుందని అంతా అనుకున్నారు. నష్టాలను అధిగమించి, లాభాల బాటలో పయనిస్తుందని ఊహించారు. అందుకు తగ్గట్టుగానే సోమవారం ఉదయం సెనెక్స్ సూచీలు వేగంగా పైపైకి దూసుకెళ్లాయి. ఒకానొక దశలో 435 పాయింట్లు లాభపడింది. కానీ, మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా పతనం మొదలైంది. జోరు తగ్గి, చివరికి 181.24 పాయింట్ల నష్టపోయి, 34,134.38 పాయింట్లతో రోజును ముగించింది. ట్రేడింగ్ 34,689.39 పా యింట్ల వద్ద మొదలై, మదుపరులు ఆకస్తిని ప్రదర్శించడంతో వేగాన్ని పుంజుకుంది. బుల్ రన్ పరు గు వేగాన్ని పుంజుకోవడంతో సెనెక్స్ 34,748.69 పాయింట్లకు చేరింది. ఇదే ఒరవడి కొనసాగి, ఈ వారం మొదటి రోజునే సూచీ 35,000 పాయింట్ల ను అధిగమించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఊహించిన దానికంటే మెరుగైన స్థితికి చేరుకోవడం, ఆసియా మార్కెట్లు సానుకూల పాత్ర పోషించడం వంటి అంశాలతోపాటు, రూపాయి మారకపు విలువ మ రికొంత మెరుగుపడడంతో పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది. కానీ, లావాదేవీలు చివరి దశకు చేరుకున్నప్పుడు ఒక్కసారిగా ప్రతికూల పవనాలు వీయడంతో మార్కెట్ కుదేలైంది. చివరి మూడు సెషన్స్‌తో పోలిస్తే, ఏకంగా 847 పాయింట్లు క్షీణించడం గమనార్హం. ఇలావుంటే, జాతీయ స్టాక్ సూ చీ సైతం నష్టాన్ని చవిచూసింది. 58.30 పాయిం ట్లు కోల్పోయిన నిఫ్టీ 10,243.25 పాయింట్ల వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) లావాదేవీల్లో ఐసీఐసీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ వంటి కంపెనీల షేర్లు లాభాల బాటలో నడిస్తే, ఇండస్‌ఇండ్, రిలయన్స్, ఎస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఇండియన్‌బుల్స్, ఇచర్ మోటర్స్, ఐసీఐసీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ లాభాలను ఆర్జిస్తే, ఇండస్‌ఇండ్, బీపీసీఎల్, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాబ్ ఫిన్‌సర్వ్ తదితర కంపెనీలు నష్టపోయాయి.