బిజినెస్

దేశంలో 81 వేల మంది కోటీశ్వరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో కోటీశ్వరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా సంపాదిస్తూ పన్ను కట్టే సంస్థలు, వ్యక్తుల సంఖ్య గత నాలుగేళ్లలో 1.4 లక్షల మంది పెరిగారని, ఈ పెరుగుదల 60 శాతమని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టు టాక్సెస్ (సీబీడీటీ) సోమవారం ప్రకటించింది. వ్యక్తిగతంగా ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆర్జిస్తున్న వారు 81 వేల మంది ఉన్నారని, గతంతో పోలిస్తే వీరి సంఖ్య 68 శాతం పెరిగిందని సీబీడీటీ తన గణాంకాల్లో పేర్కొంది. కార్పొరేట్లు, సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాల్లో పన్ను చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం సంపాదిస్తూ పన్ను కడుతున్న వీటి సంఖ్య 2014-15లో 88,649 మంది ఉండగా, 2017-18 నాటికి 1,40,139కు చేరుకుంది. ఇది 60 శాతం పెరుగుదల అని సీబీడీటీ తెలియజేసింది. ఇక వ్యక్తిగత ఆదాయం విషయానికి వస్తే కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందిన వారు 2014-15లో 48,416 మంది ఉండగా, ఇది 207-18 నాటికి 81,344 మందితో 68 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నాలుగేళ్లుగా ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పలు చర్యల కారణంగా పన్ను చెల్లించే వారి సంఖ్య బాగా పెరిగిందని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. అలాగే గత నాలుగేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించే వారి సంఖ్య 80 శాతం పెరిగిందని, 2014-15లో వీరి సంఖ్య 3.79 కోట్లు ఉండగా, 2017-18 నాటికి 6.85 కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు.