బిజినెస్

అంచనాలను మించిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ లాభార్జనలో విశే్లషకుల అంచనాలను మించిపోయింది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 14.8 శాతం పెరుగుదలతో రూ. 2,534 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ తన సాఫ్ట్‌వేర్ సేవల వ్యాపారం నుంచి అధిక ఆదాయాన్ని ఆర్జించడం వల్ల తన నికర లాభాన్ని బాగా పెంచుకోగలిగింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 2,534 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతకు ముం దు సంవత్సరం ఇదే కాలంలో ఈ కంపెనీ రూ. 2,207 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రై మాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ. 2,450 కో ట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని విశే్లషకులు గతంలో అంచ నా వేశారు. కాని, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వారి అంచనాలను మిం చి లాభాన్ని గడించింది. ఆపరేషన్స్ నుంచి వచ్చే ఆదా యం రెండో త్రైమాసికంలో 19.5 శాతం పెరిగి, రూ. 14,860 కోట్లకు చేరుకుంది. సాఫ్ట్‌వేర్ సేవల వ్యాపారం నుంచి ఆదా యం గణనీయంగా 21శాతం పెరిగి, రూ.8,711 కోట్లకు చేరింది.