బిజినెస్

పండుగల వేళ విక్రయాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: భారత్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అయిదు శాతం పెరిగి, సరికొత్త గరిష్ఠ స్థాయి 44 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. పండుగల సీజన్ ముందున్న తరుణంలో హ్యాండ్‌సెట్ల విక్రేతలు భారీగా స్మార్ట్ఫోన్లను అమ్మడం వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో వీటి అమ్మకాలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయని ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ తన నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 88 మిలియన్ యూనిట్ల హ్యాండ్‌సెట్లు అమ్ముడు పోగా, అందులో సగ భాగాన్ని స్మార్ట్ఫోన్ విభాగమే ఆక్రమించింది. జియోమి, శాంసంగ్, వివో, ఒప్పో బ్రాండ్లు గతంలో ఏ త్రైమాసికంలోనూ అమ్ముడు పోని రీతిలో ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడు పోయాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 24 శాతం వృద్ధి చెందాయి. వీటిలో 27 శాతం మార్కెట్ వాటాతో జియోమి అగ్రస్థానంలో నిలిచింది. శాంసంగ్ 23 శాతం వాటాతో ద్వితీయ స్థానంలో నిలిచింది. వివో పది శాతం వాటాతో మూడో స్థానంలో, మైక్రోమాక్స్ తొమ్మిది శాతం వాటాతో నాలుగో స్థానంలో, ఒప్పో ఎనిమిది శాతం వాటాతో అయిదో స్థానంలో నిలిచాయి. ఇటీవల చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రిలయన్స్ జియోతో పాటు మైక్రోమాక్స్ హ్యాండ్‌సెట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడంతో మైక్రోమాక్స్ గత రెండేళ్లలో మొదటిసారి అగ్ర స్థానంలో ఉన్న అయిదు కంపెనీలలో ఒకటిగా నిలిచిందని ఆ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఆర్డర్ పూర్తయితే మైక్రోమాక్స్ హ్యాండ్‌సెట్ల విక్రయాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.