బిజినెస్

తొలుత పతనమైనా కోలుకున్న రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: రూపాయి విలువ మంగళవారం తొలుత పతనమయినప్పటికీ చివరకు తిరిగి పుంజుకొని దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.57 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొంత వరకు తగ్గడం, బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయానికి పూనుకోవడం వల్ల రూపాయి పుంజుకుంది. మంగళవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.74 వద్ద ప్రారంభమయింది. భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, స్టాక్ మార్కెట్లలో ధోరణి బలహీనంగా ఉండటం వల్ల రూపాయి విలువ మరింత పతనమయి ఇంట్రా-డేలో డాలర్‌తో మారకంలో కనిష్ట స్థాయి 73.82కు పడిపోయింది. అయితే, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర 1.93 శాతం తగ్గి, పీపాకు 78.29 డాలర్లకు చేరుకోవడం వల్ల మదుపరుల ఆందోళనలు తగ్గాయి. ఈ పరిణామం రూపాయి విలువ పతనాన్ని నిరోధించింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తరపున బ్యాంకులు డాలర్లను విక్రయించడం వల్ల తరువాత రూపాయి కోలుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం ఒక పైసా నష్టంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.57 వద్ద ముగిసింది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పతనమయి, 73.56 వద్ద ముగిసింది.