బిజినెస్

ఆరు నెలల కనిష్టానికి మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ మంగళవారం కూడా బలహీనపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా ఆరు నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. రూపాయి మారకం విలువ పడిపోవడం, ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రం కావడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తిరిగి తలెత్తడం వంటి అంశాల కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయి, కీలక సూచీలు పతనానికి లోనయ్యాయి. సెనె్సక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 287.15 పాయింట్ల దిగువన 33,847.23 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 10వ తేదీ తరువాత ఈ సూచీ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 10న ఈ సూచీ 33,880.25 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే మంగళవారం 98.45 పాయింట్ల దిగువన 10,146.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ నాలుగో తేదీ తరువాత ఈ సూచీ ఇంత దిగువ స్థాయిలో ముగియం ఇదే మొదటిసారి. స్పెక్యులేటర్లు సెషన్ చివరలో షార్ట్ కవరింగ్‌కు పూనుకోవడం కీలక సూచీలు తక్కువ నష్టాలతో బయటపడటానికి దోహదపడింది. ఇదిలా ఉండగా, మంగళవారం ఇంట్రా-డేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.82కు పతనం కావడం కూడా స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. సెనె్సక్స్ మంగళవారం 287.15 పాయింట్లు (0.84 శాతం) కోల్పోయి, 33,847.23 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 33,742.75 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఈ సూచీ క్రితం మూడు సెషన్లలో కలిసి 1,028 పాయింట్లు పడిపోయింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 98.45 పాయింట్లు (0.96 శాతం) నష్టపోయి 10,146.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 10,102.35 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అమెరికా స్టాక్ మార్కెట్లు బలహీనపడటం, వాటిని అనుసరించి మంగళవారం ఇతర ఆసియా మార్కెట్లు కూడా బలహీనపడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ సెంటిమెంట్ బలహీనంగానే కొనసాగిందని బ్రోకర్లు చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం నాటి లావాదేవీలలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 511.91 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 303.21 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఆసియన్ పెయింట్స్ అత్యధికంగా 5.21 శాతం నష్టపోయింది. సన్ ఫార్మా 5.07 శాతం నష్టంతో రెండో స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, వేదాంత లిమిటెడ్, హెచ్‌యూఎల్, రిల్, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్, మారుతి సుజుకి, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 3.93 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, యెస్ బ్యాంక్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, అదాని పోర్ట్స్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ లాభపడ్డాయి. వీటి షేర్ల విలువ 2.62 శాతం వరకు పెరిగింది. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 2.79 శాతం వరకు పడిపోయింది. టెక్నాలజి 2.48 శాతం, హెల్త్‌కేర్ 2.34 శాతం చొప్పున పడిపోయాయి.