బిజినెస్

ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: రాష్ట్రంలో వనాల అభివృద్ధిలో భాగంగా ఆదాయ వనరులను సముపార్జించడమే లక్ష్యంగా ఆంధ్రపదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) పనిచేస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ దివి శివరామ్ చెప్పారు. అడవుల అభివృద్ధితో పాటు ఆదాయాన్ని సముపార్జించుకుంటూ స్వయం సమృద్ధి సాధించడమే ఈ సంస్థ ప్రధాన కార్యకలాపమన్నారు. మే 29వ తేదీన బాధ్యతలు స్వీకరించిన ఏపీఎఫ్‌డీసీ పాలకవర్గం ఛైర్మన్ డాక్టర్ డి శివరామ్ నేతృత్వంలో డైరెక్టర్లు, అధికారుల బృందం మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరంలో ఎఫ్‌డీసీకి చెందిన పలు కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు గాదిరాజు సత్యనారాయణరాజు, ప్రసాద్ రెడ్డి, నీలబాబు, బాలాజీనాయుడు, ఎల్‌ఎస్ నాయుడు, ఎఫ్‌డీసీ రీజినల్ మేనేజర్ పి రామ్మోహనరావు, ప్రాజెక్టు మేనేజర్ వరప్రసాద్‌తో కలిసి ఛైర్మన్ డాక్టర్ శివరామ్ విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 30 శాతం ఉన్న అడవులను 60 నుంచి 70 శాతానికి పెంపొందించడమే లక్ష్యంగా ఏపీఎఫ్‌డీసీ కృషిచేస్తుందన్నారు. లక్షా 2 వేల హెక్టార్ల విస్తీర్ణంలోని డీగ్రేడ్ అడవులను అభివృద్ధిచేయడానికి కార్పొరేషన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. అడవులను పెంచడం, అటవీ ఉత్పత్తులను సాధించడం, ప్రధానంగా కాఫీ తోటల పెంపకం, ఔషధ మొక్కల పెంపకంతో పాటు అంతర పంటగా మిరియాలు పెంపకం ద్వారా గణనీయమైన ఆదాయం లభిస్తోందన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెంచిన కాఫీ తోటల ఉత్పత్తిని గిరిజన కార్పొరేషన్‌కు అప్పగించామన్నారు. ఈ నేపథ్యంలో అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చామన్నారు.
కోస్తా ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతాల్లో జీడిమామిడి, సరుగుడు తోటల పెంపకం ద్వారా ఆదాయాన్ని సాధించడంతో పాటు తీరప్రాంత కోత నివారణకు కృషిచేస్తున్నామన్ని శివరామ్ వివరించారు. యూకలిప్టస్ ద్వారా ప్రధాన ఆదాయాన్ని సాధిస్తున్నామని, అందుచేత ఈ సాగుపై దృష్టి కేంద్రీకరించామన్నారు. నేషనల్ బేంబూ మిషన్ ద్వారా వెదురును ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా పెంచుతున్నామన్నారు. పులివెందులలో ఎకో పార్కు అభివృద్ధి చేశామన్నారు. వివిధ కార్యకలాపాల నిమిత్తం ఏడాదికి రూ.11.50 కోట్లు ఖర్చు చేస్తుంటే అందులో రూ.5 కోట్ల వరకు జీతాలకు కేటాయించామన్నారు. కార్పొరేషన్ పరిధిలో 450 మంది రెగ్యులర్ సిబ్బందికిగాను రెండు వందల మందే ఉన్నారన్నారు. అవసరమైన సిబ్బంది కోసం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళామన్నారు.
రాష్ట్రంలో వివిధ పేపర్ మిల్లులకు 1.50 లక్షల టన్నుల జామాయిల్, ఐటీసీకి మరో 50 వేల టన్నుల సరఫరాకు ఒప్పందం ఉందని శివరామ్ వివరించారు. రామాయంపేట పోర్టు పక్కనే ఏషియా పల్ప్ పేపర్ మిల్లు రానుందని, ఈ మిల్లుకు అవసరమైన పల్ప్ 90 శాతం స్థానికంగా సమకూర్చుకుంటే, 10 శాతం బయట నుంచి తెచ్చుకుంటారన్నారు. ఈ మిల్లు అవసరాలకు కూడా ఎఫ్‌డీసీ ద్వారా జామాయిల్ డిమాండ్‌ను భర్తీ చేయనున్నామన్నారు. శాస్ర్తియ విధానంలో జామాయిల్ పెంపకం వల్ల ఎఫ్‌డీసీకి టన్ను ఒక్కింటికి రూ.4800 వరకు లభిస్తోందన్నారు. ఎర్రచందనం మార్కెటింగ్‌కు సంబంధించి ఎఫ్‌డీసీ ఒక సెల్లింగ్ ఏజెంట్ మాత్రమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చైర్మన్ డాక్టర్ శివరామ్ చెప్పారు. భూగర్భ జలాలకు విఘాతం కలిగించే జామాయిల్ ఎందుకు విస్తరిస్తున్నారనే ప్రశ్నకు సమాధానంగా కేవలం డీగ్రేడ్ అడవిలో ఏడు నుంచి పదేళ్ల కాల వ్యవధిలో ఉండే జామాయిల్‌ను వేస్తున్నామన్నారు. ఏదేమైనప్పటికీ అడవుల సంరక్షణ, అభివృద్ధి, ఆదాయం సమకూర్చడమే ప్రధానంగా ఎపీఎఫ్‌డీసీ పనిచేస్తుందని శివరాం వివరించారు.
చిత్రం..విలేఖర్లతో మాట్లాడుతున్న ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్ శివరామ్