బిజినెస్

సాగర్‌లో విద్యుదుత్పత్తి లక్ష్యసాధన కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిలో ఈసంవత్సరం టార్గెట్ చేరుకోవడం కష్టమే అని సాగర్ జన్‌కో ఎస్‌ఈ రాజనర్సయ్య తెలిపారు. మంగళవారం సాగర్ జన్‌కో కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సాగర్‌లోని ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో 1,120 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని టార్గెట్‌గా తీసుకున్నామన్నారు. అయితే, 2018 ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ 23 వరకు ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 207 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగామని తెలిపారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిలో నిర్ణయించిన టార్గెట్‌ను చేరుకోవడం అసాధ్యం అనిపిస్తోందని తెలిపారు. అక్టోబర్ మాసం చివరివరకు కూడా కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరదలు ఉన్నట్లయితే నిర్ణయించిన విద్యుత్ ఉత్పత్తి టార్గెట్‌ని చేరుకోనే అవకాశం ఉండేదన్నారు. ఆంధ్ర పరిధిలోని కృష్ణా డెల్టాకు నీటివిడుదల విషయంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇప్పటివరకు నీటివిడుదలలో ఏటువంటి నిర్ణయం తీసుకోని కారణంగా ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అత్యవసర పరిస్ధితులలో మాత్రమే చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు పవర్‌గ్రిడ్‌లో తప్పనిసరిగా విద్యుత్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని చేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగానికి డిమాండ్ ఎక్కువగా ఉండి యూనిట్‌కు 18.25 పైసలకంటే ధర ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తిని తప్పనిసరి పరిస్థితులలో సాగర్‌లో చేపడుతున్నామన్నారు. ఈ కారణంగా ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేటాయించిన టార్గెట్‌లో ఇప్పటికే 20 శాతం కూడా సాధించలేకపోయామన్నారు.
సాగర్ పరిధిలోని ఎడమకాల్వపై ఉన్న జలవిద్యుత్ కేంద్రానికి 55మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి టార్గెట్ కేటాయించగా ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం నుండి నేటివరకు 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టామన్నారు. దీనికి 35 టీఎంసీల నీటిని ఉపయోగించమన్నారు.
నాగర్జునసాగర్‌లోని
చిత్రం..ప్రధాన జలవిద్యుత్ కేంద్రం,
* (ఇన్‌సెట్‌లో ) విలేఖరులతో మాట్లాడుతున్న జెన్‌కో ఎస్‌ఈ రాజనర్సయ్య