బిజినెస్

నెల కనిష్టానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి, కొటక్ మహీంద్ర త్రైమాసిక ఫలితాలు మదుపరులకు మొండి బకాయిలపై ఆందోళనలను కలిగించాయి. దీంతో పెట్టుబడుల ఉపసంహరణకు దిగగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు నెల రోజుల కనిష్టాన్ని తాకుతూ 205.37 పాయింట్లు దిగజారి 27,710.52 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 55.75 పాయింట్లు కోల్పోయి 8,510.10 వద్ద స్థిరపడింది. పవర్, యుటిలిటీస్, బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, రియల్టీ, ఆటో, మెటల్ రంగాల షేర్ల విలువ 2.10 శాతం నుంచి 0.63 శాతం పడిపోయింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హంకాంగ్, చైనా సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు పెరిగితే, జర్మనీ నష్టపోయింది.
రికార్డు స్థాయికి
బిఎస్‌ఇ మార్కెట్ విలువ
మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ గురువారం రికార్డు స్థాయికి చేరడం గమనార్హం. మునుపెన్నడూ లేనివిధంగా మదుపరుల సంపద 107 లక్షల కోట్ల రూపాయలను తాకింది. 2015 ఏప్రిల్‌లో అత్యధికంగా 106.85 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైతే, నేడు అది 1,07,00,756 కోట్ల రూపాయలుగా ఉంది. 2014 నవంబర్‌లో 100 లక్షల కోట్ల మార్కును బిఎస్‌ఇ తాకింది. ప్రస్తుతం బిఎస్‌ఇలో 2,400లకుపైగా సంస్థలున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ప్రపంచంలోని టాప్-10 స్టాక్ మార్కెట్లలో బిఎస్‌ఇ ఒకటి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా బిఎస్‌ఇ సూచీ సెనె్సక్స్ 1,798.35 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్ 4,90,538.04 కోట్ల రూపాయలతో బిఎస్‌ఇ మార్కెట్ విలువలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 3,27,600.39 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3,11,811.40 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో, ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి 3,04,536.08 కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో, దేశీయ రెండో అతిపెద్ద ఐటి సంస్థ ఇన్ఫోసిస్ 2,47,656.57 కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో ఉన్నాయి.