బిజినెస్

11 పైసలు పతనమైన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: రూపాయి విలువ గురువారం 11 పైసలు పతనమయింది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా తరలిపోతుండటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా బలహీనపడటం వంటి అంశాలు రూపాయిని దెబ్బతీశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం 11 పైసలు పతనమయి, 73.27 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు అమెరికా మార్కెట్లలో పెట్టుబడులపై ఆదాయాలు పెరగడం వంటి అంశాలు రూపాయిని బలహీనపరిచాయి. విదేశీ పెట్టుబడిదారులు గురువారం భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 1,495.71 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు బుధవారం కూడా నికరంగా రూ. 2,046.54 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతుండటం రూపాయి మరింత బలహీనపడకుండా నివారించిందని డీలర్లు చెప్పారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోవడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురుకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందనే భయాందోళనలతో ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. బ్రెంట్ ముడి చమురు ధర పీపాకు 76.71 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్‌లో గురువారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.33 వద్ద ప్రారంభమయింది. తరువాత మరింత పతనమయి ఇంట్రా-డేలో కనిష్ట స్థాయి 73.37కు చేరింది. ఆ తరువాత కొంత కోలుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 11 పైసల దిగువన 73.27 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ బుధవారం 41 పైసలు పెరిగి, మూడు వారాల గరిష్ఠ స్థాయి 73.16 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.