బిజినెస్

కష్టాల్లో టెలికాం రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత దేశంలో టెలికాం రంగం అనేకానేక కష్టాలను ఎదుర్కొంటున్నదని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత టెలికాం రంగం నుంచి సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను మదుపరులు వెనక్కు తీసుకున్నారని, దీనితో చాలా మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. మద్యం పన్నులతో పోటీగా టెలికాం పన్నులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారీ పన్నుల విధానం కూడా దేశంలో టెలికాం రంగాన్ని దెబ్బతీస్తున్నదని అన్నారు. దేశంలోని టెలికాం మొబైల్ ఆపరేటర్ ప్రతి 190 రూపాయలకు 37 రూపాయలను పన్నులు, ఇతరత్రా ఖర్చుల కింద చెల్లించుకోవాల్సి వస్తున్నదని అన్నారు. ఒకవైపు టెలికాం రంగం సత్వర అభివృద్ధిని కోరుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటిస్తున్నారని, మరోవైపు ప్రభుత్వం భారీగా పన్నులు వడ్డిస్తున్నదని అన్నారు. రెండు పరస్పర ప్రతికూల పరిస్థితులు ఒకేసారి ఎలా కొనసాగుతాయని వ్యాఖ్యానించారు. టెలికాం రంగం మరింత అభివృద్ధి కావాలంటే, భారీ పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, అందుకు భిన్నంగా ఉన్న పెట్టుబడులే వెనక్కు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రంగాన్ని మెరుగు పరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సునీల్ మిట్టల్ డిమాండ్ చేశారు.