బిజినెస్

తగ్గిన బీహెచ్‌ఈఎల్ షేర్ వాల్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) షేర్లు డిపాజిట్లు మంచి ఫలితాలు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ గురువారం ఈ సంస్థ షేర్ల విలువ మాత్ర తగ్గింది. గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి ఆ సంస్థ 8శాతం ఆదనపు ఆదాయాన్ని ఆర్జించింది. స్టాక్ మార్కెట్‌లో ఈ కంపెనీ ఎన్‌ఎస్‌ఈ షేర్ల విలువ 7.96 శాతం తగ్గిపోయి 69.90 రూపాయల వద్ద నిలిచింది. బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ విలువ 2,055.7 కోట్ల రూపాయలు తగ్గిపోయి 25,828.30 కోట్లకు చేరింది. ఈక్విటీ వాల్యూమ్‌లో ఈ కంపెనీకి చెందిన 31.31 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. అలాగే 4 కోట్ల షేర్లు ఎన్‌ఎస్‌ఈలో చేతులు మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ విద్యుత్ విడిభాగాల తయారీ ప్లాంటు గడచిన త్రైమాసికానికి 60 శాతం అదనపు ఆదాయాన్ని చూపింది. గడచిన త్రైమాసికంలో ఈ కంపెనీ స్థూల ఆదాయం రూ.185.17 కోట్లు ఆర్జించింది. గడచిన యేడాది ఇదే కాలానికి రూ.115.42 కోట్లు ఆదాయం ఈ కంపెనీకి వచ్చింది. విపరీతమైన వ్యాపార పోటీని ఓ వైపు ఎదుర్కొంటూనే ఈ సంస్థ టర్నోవర్ ఏడు శాతం పెరిగి 6,607 కోట్లకు చేరింది. 2018-19 తొలి ఆరు నెలల కాలానికి ఈ కంపెనీకి రూ.9,530 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. గడచిన 2017-18తో ఇదే కాలానికి రూ.3,618 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.