బిజినెస్

భారత్‌కు ఎయిర్ ఇటలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: తొలిసారిగా భారత మార్కెట్‌లోకి ఇటలీ ప్రవేశిస్తోంది. అక్కడి మిలాన్ మాల్పెన్సా హబ్ నుంచి ఢిల్లీ, ముంబయిలకు విమాన సర్వీసులను డిసెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు గురువారం నాడిక్కడ అధికారులు తెలిపారు. వాస్తవానికి భారత్‌కు విమాన సర్వీసులను ఈనెల నుంచే ప్రారంభిస్తున్నట్లు గతంలో ఇటలీ ప్రకటించింది. కాగా భారత్‌లోని రెండు రూట్లలో నడుపనున్న ఇటలీ ఎ-330 ఎయిర్ క్రాఫ్ట్‌లో 252 సీట్లు ఉంటాయి. అందులో 24 బిజినెస్ క్లాస్ సీట్లు కాగా మిగిలినవి ఎకానమీ సీట్లు. భారత దేశంలోప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న వ్యాపార, పర్యాటక స్థలాలైన ముంబయి, ఢిల్లీలకు విమాన సర్వీసులు నడపబోవడం ఆనందంగా ఉందని ఎయిర్ ఇటలీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోస్సన్ డిమిత్రోవ్ పేర్కొన్నారు. వారానికి మూడు విమానాల వంతున ఢిల్లీ, ముంబై నగరాలకు ఇటలీలోని మిలాన్ మాల్పెన్సాలో గల అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి నడపాలని నిర్ణయించినట్లు ఈ యూరోపియన్ విమానయాన సంస్థ తెలిపింది. ఢిల్లీ నుంచి డిసెంబర్ 7న, ముంబయి నుంచి డిసెంబర్ 14న ఈ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కొత్త సర్వీసుల వల్ల భారత్-ఇటలీల మధ్య ప్రయాణించే వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పర్యాటకులకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పర్యాటక రంగాల్లో సంబంధాల బలోపేతానికి ఇది దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు డిమిత్రోవ్ చెప్పారు. ఈ విమాన సర్వీసులు న్యూయార్క్, మియామీ, రోమ్, పాలెర్మో, కెటానియా, నపోలీ, లమెజియాటేర్మె, ఆల్బియా నగరాల మీదుగా నడుస్తాయన్నారు.