బిజినెస్

చంద్రబాబు చెంతకు ‘ఈ-సైకిల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: దేశంలోనే తొలి ఈ-సైకిల్‌ను చెన్నైకి చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అనూప్ నిశాంత్ రూపొందించగా, ఈ సైకిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు గురువారం తీసుకువచ్చాడు. వోల్టా పేరుతో రూపొందించిన ఈ సైకిల్ గురించి నిశాంత్ పది నిమిషాలపాటు డెమో ఇచ్చాడు. అవకాశం ఇస్తే శ్రీసిటీలో ఈ-సైకిల్ పరిశ్రమను స్థాపిస్తానని నిశాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించాడు. పోర్టుకు దగ్గరగా స్థలాన్ని కేటాయిస్తే, ఈ సైకిళ్ళను ఎగుమతి చేయడానికి కూడా అనువుగా ఉంటుందని నిశాంత్ వివరించాడు. ఈ పరిశ్రమ నాలుగు యూనిట్లను ఏర్పాటు చేస్తే, 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నాడు. 35 వేల రూపాయలు ఖరీదు చేసే ఈ సైకిల్‌ను ఏపిలో 30 వేలకే అందిస్తానని నిశాంత్ చెప్పడం విశేషం. గ్రీన్, అండర్ వాటర్ కానె్సప్ట్‌తో రూపొందుతున్న అమరావతిలో పర్యావరణ పరిరక్షణకు ఈ-సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని బాబుకు ఈ సందర్భంగా సూచించాడు. కాగా, తగిన ప్రతిపాదనలతో వస్తే, స్థలాన్ని కేటాయించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తారని చంద్రబాబు నిశాంత్‌కు హామీ ఇచ్చారు.

చిత్రం.. ఈ-సైకిల్‌ను పరిశీలిస్తున్న చంద్రబాబు