బిజినెస్

కుప్పకూలిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న మాంద్యం తీవ్ర ప్రభావం చూపడంతో, గురువారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) దారుణంగా దెబ్బతింది. దీనితోపాటు వివిధ అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో, ట్రేడింగ్‌లో 344 పాయింట్లు కోల్పోయి, చివరికి 33,690.09 పాయింట్ల వద్ద స్థిరపడింది. బుధవారం నాటి లావాదేవీలతో ఊపందుకున్న బుల్న్ అదే దూకుడును కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, గురువారం ఉదయం నుంచే ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో, పాయింట్ల పతనం మొదలైంది. అక్టోబర్‌తో ముగిసే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) పెట్టుబడులను మదుపరులు నవంబర్ సిరీస్‌లో కొనసాగిస్తారని విశే్లషకులు సైతం అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. కానీ, ఒక్క రోజులోనే అంచనాలు తారుమారయ్యాయి. ద్రవ్య లభ్యత తగ్గడంతో తలెత్తిన సమస్యలు ఒకవైపు, రూపాయి పతనం నుంచి చెప్పుకోదగిన రీతిలో కోలుకోవడం లేదన్న వాస్తవం మరోవైపు మదుపరుల దృష్టి మరల్చింది. ద్రవ్య మాంద్యం సహజంగానే మార్కెట్‌ను అతలాకుతలం చేసింది. ఫలితంగా సెనె్సక్స్ దారుణంగా దెబ్బతిన్నది. ఎఫ్ అండ్ ఓ పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడం కూడా సెనె్సక్స్ సూచీపై ప్రభావం చూపింది. ఈవారంతంలోగా రికార్డు స్థాయిలో బలపడుతుందని అనుకుంటున్న తరుణంలోనే, సస్నెస్క్ ఒక్కసారిగా కుప్పకూలడం దేశీయ పెట్టుబడిదారులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నది. శుక్రవారం నాటి లావాదేవీల్లో మార్కెట్ పుంజుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విప్రో, కోల్ ఇండియా, కోటక్ మహీంద్ర, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్, వెదాంత, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎస్ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. మొత్తం మీద 34,833.96 పాయింట్ల వద్ద మొదలైన లావాదేవీలు మరోసారి 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తంకాగా, అందుకు భిన్నంగా 343.87 పాయింట్లు నష్టపోవడం మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
ఇలావుంటే, సెనె్సక్స్‌తోపాటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కూడా నష్టాల బాట పట్టింది. 99.85 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,124.90 పాయింట్ల వద్ద ముగిసింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌ఓసీ, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీలు లాభాలను ఆర్జిస్తే, ఇండియాబుల్స్, భారతీ ఎయిర్‌టెల్, యూపీఎల్, వేదాంత, హిందాల్‌కో తదితర కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.